‘భరత్ అనే నేను’ లో ఆ సీన్ కి చప్పట్లు కొట్టాను : చిరంజీవి

Wednesday, May 2nd, 2018, 10:18:11 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు తర్వాత సూపర్ హిట్ కొట్టిన చిత్రం భరత్ అనే నేను. ఇటీవల విడుదలయిన ఈ చిత్రం అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ తో, కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా రికార్డులతో పాటు, పలువురు సెలెబ్రిటీల ప్రసంశలు కూడా అందుకుంటోంది. ఇటీవల ఈ సినిమా చూసిన లోక్సత్తా జెపి, కొరటాల చిత్రం బాగా తీసారని, మహేష్ నటన బాగుందని మెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ లో ఎప్పుడు ఏ చిత్రం విజయవంతం అయినా, ఆ చిత్ర నటులని, సాంకేతిక వర్గాన్ని అభినందించడంలో అందరికంటే ముందుంటారు మన మెగాస్టార్ చిరు. ప్రస్తుతం మా అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా అమెరికా యాత్రలో వున్న మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ మహేష్ బాబు అంటే మా ఇంట్లో అందరము ఇష్టపడంతామని,

తన సినిమా విడుదలయితే కుటుంబ సభ్యులం అందరం కలిసి తన సినిమా చూసి ఎంజాయ్ చేస్తామని అన్నారు. అలానే మొన్న విడుదలయిన భరత్ అనే నేను చూశామని, కొరటాల దర్శకత్వ ప్రతిభ, మహేష్ బాబు అద్భుత నటన సినిమాకి కీలకంగా నిలిచాయని అన్నారు. ఒక మంచి మెసేజి వున్న చిత్రాన్ని మరీ ఎక్కువ కమర్షియల్ అంశాలు పెట్టకుండా దర్శకుడు సినిమాని నడిపించిన తీరు సూపర్ అన్నారు. అలానే ముఖ్యంగా సినిమాలో క్లైమాక్స్ సన్నివేశంలో మహేష్ బాబు మీడియా వారిని ఉద్దేశించి చెప్పే డైలాగులు, ఆ మొత్తం సన్నివేశం వస్తున్నపుడు చప్పట్లు కొట్టలేకుండా ఉండిపోయానని మెగా స్టార్ అన్నారు……