లోకేష్ లా గోల్డెన్ స్పూన్ తో రాజకీయాల్లోకి రాలేదు!

Thursday, July 26th, 2018, 03:21:41 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజాసమస్యలను తెలుసుకునేందకు ఆంధ్రప్రదేశ్ లో ప్రజా పోరాట యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అయన పార్టీలోకి చేరికలు జరుగుతుండడంతో వారికీ అహ్వాహం పలుకుతున్నారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని డిఎన్నార్ కళాశాల విద్యార్థులతో, అలానే ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల జనసైనికులతో ఆయన సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడుతూ, కింది స్థాయి వ్యక్తి యొక్క సమస్యలు తెలుసుకుని తీర్చగలిగినపుడు ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల్లో మంచి పేరు సాధించగలడని అన్నారు. గత ఎన్నికల సమయంలో తాను రాష్ట్రానికి మేలు జరుగుతుందని, అంతేకాక రాజాధాని నిర్మాణం మరియు అభివృద్ధి కూడ బాగా జరుగుతాయనే ఉద్దేశంతోనే టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుగారు ఎన్నోయేళ్ల రాజకీయ అనుభవం కల వ్యక్తి అని, రాజకీయయాల్లో ఆయన ఎన్నో చూసారని, మరి అటువంటి నాయకుడు నాలుగేళ్లపాడు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేయకుండా ఉంటే, చూస్తూ ఎలా వూరుకున్నారని అన్నారు. అప్పట్లో రాష్ట్రానికి హోదా తెస్తామన్నారు, విభజన హామీల విషయమై కూడా అన్నివిధాలా నెరవేరుస్తామని చెప్పారు. చూస్తూ ఉండగానే నాలుగేళ్లు గడిచిపోయింది, ఇక్కడ ప్రజల పరిస్థితీ, రాష్ట్రం, రాష్ట్రంలోని పలు రంగాల పరిస్థితి,

మరీ ముఖ్యంగా రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన యువత పరిస్థితీ అయితే మరింత దిగజారిపోయిందని, వీటికి చంద్రబాబు గారు ఏమి సమాధానం చెపుతారని ప్రశ్నించారు. ఓవైపు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగాలకు ఢోకా వుండదు అన్నారు. తీరా చూస్తే ఎంతో మంది యువతీ యువకులు ఇక్కడ సరైన ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్నారని అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని గత ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు, బాబు వచ్చారు, అయితే జాబు కేవలం వారి కుమారుడికి మాత్రమే వచ్చిందని, లోకేష్ లా తాను గోల్డెన్ స్పూన్ తో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. మీకుమారుడు, మరియు మీ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్న విషయం మీకు తెలిసి కూడా ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, లోకేష్ కేవలం ఏ పని చేస్తే మనకి ఎంత లాభం వస్తుంది అనే చందాన లెక్కలు వేసుకుని పనులు చేస్తున్నారని అన్నారు. ఈ విధంగా గుంటూరు లో జనసేన ఆవిర్భావ సభలో తాను చేసిన వ్యాఖ్యలను ఆయన మరొక సారి గుర్తు చేసారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందని, ఇప్పటికైనా ప్రజలకు మేలు చేసేలా మీ పార్టీ నాయకులకు మీరే సూచనలు చేయాలనీ చంద్రబాబు ను ఆయన కోరారు. ఇక రాబోవు ఎన్నికల్లో ప్రజలు తమకు ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం అందిస్తారన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు….

  •  
  •  
  •  
  •  

Comments