బర్త్ డే వేడుకలు జరుపుకోవడం అలవాటు లేదు : పవన్ కళ్యాణ్

Sunday, September 2nd, 2018, 10:38:07 PM IST

మెగాస్టార్ కు తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, తరువాత తన సినీ కెరీర్ ని మెల్లగా బిల్డ్ అప్ చేసుకుంటూ, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని, అభిమానుల పాలిట పవర్ స్టార్ గా ఎదిగి, వారి గుండెల్లో చెరగని ముద్రవేశారు. కాగా నేడు అయన తన 47వ జన్మదినంలోకి అడుగుపెట్టారు. అయితే నిజానికి పవన్ కు మొదటినుండి ఇటువంటి వేడుకలు చేసుకోవడం ఇష్టం లేదని అయన ఇదివరకు పలుమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అయితే ప్రతి జన్మదినం మాదిరి ఈ రోజు కూడా అయన అబిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు.

అంతే కాదు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. కాగా కొద్దిసేపటి క్రితం పవన్ జనసేనపార్టీ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు పవన్. నాకు చిన్నప్పటినుండి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అలవాటు లేదు. అయితే నా మీద అభిమానంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవ కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులకు ధన్యవాదాలు అని చెప్పారు. అంతేకాక ఆయనకు పుష్పగుచ్ఛం పంపిన రామోజీ రావుకు, అలాగే సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు మరియు లోకేష్ లకు, అలానే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు….

  •  
  •  
  •  
  •  

Comments