ఆమెతో నాకు ఎలాంటి సంబందం లేదన్న సీతారామరాజు

Friday, June 7th, 2013, 09:02:43 AM IST

రాష్ట్రంలో ఉండే ఎన్నో ఉన్నత ప్రభుత్వ పదవులకు ఎపీపీఎస్సీ రాత పరీక్ష ద్వారానే సెలక్షన్ జరుగుతుంది. కానీ ఎపీపీఎస్సీ ఎగ్జామ్ ఎంత కష్టపడి రాసినా డబ్బున్న వాడికే పదవులు దక్కుతున్నాయని, మార్కెట్లో సరుకుల్లా ఈ పోస్టులను సంద్యారాణి అనే ఒక లేడీ అమ్మేస్తోందని ఎబిఎన్ చానల్ బయటపెట్టింది. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఈ విషయంలో సంధ్యారాణితో ఎపీపీఎస్సీ బోర్డ్ మెంబర్ సేతారామరాజుకి కూడా సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణల పై స్పందించిన సీతారామరాజు మాట్లాడుతూ ‘ నాకు సంధ్యారానికి ఎలాంటి సంబంధం లేదు. తనతో నాకు ఉన్నది కేవలం ముఖ పరిచయం మాత్రమే, అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడేది, భోజనానికి పిలిచేది కానీ నేను వెళ్ళలేదు. అంతకన్నా ఆమెతో నాకు పెద్దగా పరిచయం కూడా లేదని’ అన్నాడు. పేకాట ఆడుతూ దొరికిపోయారు దానికి మీ సమాధానం ఏమిటి అని అడిగితే ‘ నా ఫ్రెండ్ రాజు భోజనానికి పిలిస్తే వెళ్లాను అదే రోజు సంద్యారాణి కూడా బోజనానికి పిలిచారు కానీ నేను రాజు ఇంటికి వెళ్లాను. అక్కడ ఏదో పేక ముక్కలుంటే పట్టుకున్నానే తప్ప అది సీరియస్ గా ఆడింది కాదు. ఒకవేళ నిజంగా పేకాట ఆడినా అదేమన్నా పెద్ద నేరమా? మేము ఎలాగో బయటకి వెళ్లి ఆడలేం కనీసం ఇంట్లో కూడా సాదాగా ఆడుకునే హక్కు లేదా అని’ సీతారామరాజు ప్రశ్నించాడు.

ఇదిలా ఉంటే ఎబిఎన్ చానల్ తీసిన కథనాన్ని ఫిర్యాదుగా స్వీకరించామని, వెంటనే దీని పై విచారణ జరిపిస్తామని, ఎపీపీఎస్సీ లో జాబ్స్ విషయంలో అక్రమాలు జరిగాయని తేలితే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని ఎపీపీఎస్సీ చైర్మెన్ బిశ్వాల్ తెలిపారు. స్పాట్ ఫిక్సింగ్ కేసు దర్యాపు జరుగుతున్నా కొద్దీ పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయటకోస్తున్నాయి, అలాగే ఈ ఎపీపీఎస్సీ జాబ్స్ మాఫియాలో ముందు ముందు ఎవరెవరి పేర్లు వస్తాయో చూడాలి.