జనసేనని అసలు లెక్కలోకి తీసుకోను.. పృథ్వీ సంచలన వాఖ్యలు…

Wednesday, November 21st, 2018, 07:03:41 PM IST

తెలుగు చలన చిత్ర హాస్య నటుడు పృథ్వీ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. తాను హాజరైన సభలలో వైసీపీ కి మద్దతుగా చాలా సార్లు మాట్లాడాడు కూడా… తన పార్టీ కి మద్దతు ఇస్తూ మిగతా పార్టీ వాళ్ళ మీద విమర్శలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు. ఇన్ని రోజులు టీడీపీ ని విమర్శించినా పృథ్వీ కళ్ళు తాజాగా జనసేన మీద పడ్డాయి. జనసేన పార్టీ కి అసలు డిపాజిట్లు దొరకవని, జనసేన ఎన్నికలలో పోటీ చేసి ఉత్త దండగ అని, అసలు జనసేనాని ఎవరు పట్టించుకోవట్లేదని కూడా విమర్శిస్తున్నారు పృథ్వీ.నేను న పార్టీ తరపున మాట్లాడటం లేదని, జనాలందరినీ అడిగాకే ఈ నిర్ణయానికి వచ్చానని చెప్తున్నారు.

పవన్ సినిమాల్లో రాణించినత మాత్రాన రాజకీయాల్లో కూడా రాణిస్తాడని అనుకోవడం వట్టి పనికిమాలిన విషయం. అందుకే ఈసారి జనసేన కి ఓటర్లు కరువవుతారు అని పృథ్వీ సంచలన వాక్యాలు చేసారు. ఆయన స్టేజి ఎక్కి ఆగిపోవడం తప్ప వేరే చేసేదేముంది, నేను స్టేజి ఎక్కినా కానీ అంతకు మించే మాట్లాడుతానని, కానీ అవన్నీ వినాల్సిన అవసరం జనాలకి లేదని పృథ్వీ తెలిపారు. జనసేన వళ్ల మాకేం నష్టం లేదని, ఈసారి మేము అధికారం లోకి రావడం ఖాయమని తెలిపారు. ఇంకా కుల రాజకీయాలు చేయడం మూర్ఖత్వం అని, అలంటి తప్పులే పవన్ చేస్తున్నాడని విమర్శించాడు.