అయ్యో ఆయనికి సొంతిల్లు కూడా లేదంట !

Wednesday, May 23rd, 2018, 02:55:15 PM IST

అయ్యో ఆయనకి అసలు సొంత ఇల్లు కూడా లేదంటే నమ్ముతారా..?
ఇంతకీ సొంత ఇల్లు కుడా లేనిది ఎవరికి అనుకుంటున్నారా? ఆ పేదవాడు మరెవరో కాదండోయ్ సాక్ష్యాత్తు మన ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్ గారు.ఇక అసలు వివరాలలోకి వెళితే, పదవి కాలం ముగిసినా కుడా ఆయన ప్రభుత్వ భవనాలను మాత్రం ఖాళీ చేయడం లేదు. దాంతో ఎన్ని సార్లు ఖాళీ చేయమని చెప్పినా, ఖాళీ చేయనందున, తాజాగా సుప్రేం కోర్ట్ కూడా సదరు అఖిలేష్ గారిని ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయమని ఉతర్వులు జారీ చేసింది. దాంతో అఖిలేష్ యాదవ్ గారు నాకు కనీసం సొంత ఇల్లు కూడా లేదు మరియు అదీకాక ఇప్పటికిప్పుడు ఖాళి చేయాలంటే ఎలా అని వాపోయారు. అంతేకాక, అద్దె ఇంటికి మారేంత వరకు కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును గడువు కోరారు. మరికొంత సమయం ఇస్తే ఒక సొంత ఇల్లును నిర్మించుకుoటానని కోర్ట్ ని గడువు కోరారు…

ఇలా సొంత ఇల్లు లేని వారు, కేవలం మన అఖిలేష్ యాదవ్ గారు ఒక్కరే కాదండోయ్ ఇంకా చాలా మందే ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే మన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్, ఎన్డీ తివారీలు కూడా ఉన్నారు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా కనికరించి వీరికి ఒక సొంత ఇల్లు మంజూరు చెయ్యాలని ఆశిద్దాం..

  •  
  •  
  •  
  •  

Comments