నాకు ఆయన పేరు పలకడం కూడా ఇష్టం లేదు : థర్టీ ఇయర్స్ పృథ్వి

Sunday, June 3rd, 2018, 06:24:03 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై టాలీవుడ్ లో థర్టీ ఇయర్స్ పృథ్వి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇప్పటికే వైసిపికి మద్దతుదారుడుగా పేరున్న పృథ్వి ఇదివరకటి ఎన్నికల్లో వైసిపి తరపున ప్రచారం కూడా నిర్వహించారు. అంతే కాదు ఇటీవల జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆయన పశ్చిమ గోదావరి విచ్చెసినపుడు పృథ్వి ఆత్మీయంగా కలుసుకుని ఆయనతో కాసేపు తన పాదం కలిపి యాత్ర చేశారు. కాగా నేడు అయన నెల్లూరు లోని విఆర్సి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వైసిపి పార్టీ సమావేశంలో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడాడారు. వైఎస్ జగన్ నిరంతర కృషీవలుడుగా యాత్ర మొక్కవోని దీక్షతో కొనసాగిస్తున్నారని, ఇంతటి ఎండలను సైతం ఆయన లెక్కచేయకుండా, ఆరోగ్యం సహకరించకపోయినా తట్టుకుని అలానే ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం యాత్ర చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఆయన విజయం తధ్యమని అన్నారు.

తాను టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి ముప్పయ్యేళ్లు అవుతుందని, తన జీవనాధారంకోసం వేషాలు వేసుకుని ఆ డైలాగ్ పలుకుతున్నాని, ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే తమ పార్టీ ముప్పై ఏళ్ళ చరిత్ర గలది అని చెప్పుకోవడంతప్ప ప్రజలకు చేసినది ఏమి లేదని అన్నారు. టిడిపి పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మంచి ముందుచూపు, రాష్ట్ర అభివృద్ధి చేయగల నాయకుడు అయిన జగన్ లాంటి వ్యక్తి అధికారం చేపట్టాలని వారు కోరుకుంటున్నట్లు తెలిపారు. నిజానికి చంద్రబాబు లాంటి కుటిల రాజకీయాలు చేసే వ్యక్తి పేరు పలకడం కూడా తనకు ఇష్టం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనపేరు చెప్పవలసి వస్తోందని చెప్పారు. అంతేకాదు దాదాపు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం గల చంద్రబాబు, నలభైఏళ్ళ వయసున్న జగన్ ను చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. టీపీడీకి ప్రజల సంక్షేమమం పై అస్సలు శ్రద్ధ లేదని, అవినీతి, అన్యాయం వారి పాలనలో పెట్రేగిపోయాయని మండిపడ్డారు…..