చంద్రబాబు దొరికేసాడన్న వర్మ .. ?

Sunday, October 14th, 2018, 09:28:15 AM IST

మొత్తానికి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అటు ఇటు చేసి చంద్రబాబు ను పట్టేసాడు. నిన్న అచ్చు చంద్రబాబు లా ఉన్న ఓ వ్యక్తి ఫోటో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ తాను తెరకెక్కిస్తున్న లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాకోసం చంద్రబాబు కనిపించాడు ఆయన ఆచూకీ చెబితే వారికి లక్ష ఇస్తానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మరో వీడియోని పోస్ట్ చేస్తూ తనకు చంద్రబాబు దొరికాడని చెప్పాడు. ముందు చెప్పినట్టే ఆచూకీ చెప్పిన వారికి లక్ష రూపాయలను ఇస్తానని చెప్పాడు. టివి 9లో పనిచేస్తున్న రోహిత్ అనే యువకుడు చంద్రబాబు ను పోలిన మనిషి ఆచూకీ చెప్పేశాడట . ఈ సందర్బంగా అతనికి కృతజ్ఞత తెలుపుతూ వర్మ ఈ ట్విట్ పెట్టాడు. ఎన్టీఆర్ బయోపిక్ గా తాను తెరకెక్కించే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా దసరాకు మొదలు పెడతానని చెప్పాడు. సినిమాల్లో పాత్రలకు అచ్చంగా ఆయా వ్యక్తులను పోలిన వారిని తెరపైకి టెస్టు వర్మ సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఇదివరకే వీరప్పన్ సినిమా విషయంలో కూడా అచ్చు వీరప్పన్ లాంటి వ్యక్తి ని తెచ్చి షాక్ ఇచ్చాడు. ఇప్పుడేమో చంద్రబాబు ని వెదికేసాడు.