టీడీపీ చేసిన అక్రమాలకు ఆధారాలు ఉన్నాయి..అంటున్న?

Tuesday, September 25th, 2018, 05:27:29 PM IST

ప్రస్తుతం ఉన్న రోజుల్లో అవినీతి ఆరోపణలు లేనటువంటి రాజకీయ పార్టీలు మరియు రాజకీయ నాయకులు చాలా తక్కువే అని చెప్పాలి.వారు నిజంగానే చేసారా లేదా అన్న సంగతి పక్కన పెడితే అవి మాత్రం ఎప్పటికి తేలని కేసులుగా మిగిలిపోతాయని అందరికి తెలుసు.ఆ మధ్య తెలుగుదేశం ప్రభుత్వం మీదనూ మరియు నారా లోకేష్ మీద జనసేనాని భూకబ్జాలు మరియు అక్రమ ఇసుక రావాణా మీద సంచలన వ్యాఖ్యలు చెయ్యడంతో ఆరిపోతున్న దీపంలో నూనె పోసినంత పనయ్యింది.దానితో ఆ విషయాలు మరింత చర్చకు వచ్చాయి.

వీరి యొక్క అక్రమాల మీద పవన్ కల్యాణే కాకుండా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్య నాయకులు విష్ణుకుమార్ రాజు గారు కూడా పలు మార్లు ఆరోపణలు చేశారు.నిన్న శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి మంత్రి నారా లోకేష్ మీద అవినీతి ఆరోపణల మీద సిబిఐ కేసు వేయాలన్న విషయం మీద మాట్లాడుతూ,ఆధారాలు ఉన్నట్టయితే ఎవరైనా సరే కేసు పెట్టొచ్చని తెలిపారు,అంతే కాకుండా తాను కూడా టీడీపీ ప్రభుత్వం పట్ల లోకేష్ చేసిన అవినీతి అక్రమాలు,భూకబ్జాలు పట్ల నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే వారి మీద ఆరోపణలు చేశానని,ఈ విషయం తాను టీడీపీ పార్టీలో ఉన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నానని అంతే కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చెయ్యనని పేర్కొన్నారు.