శ్రీదేవి మరణం నా జీవితానికి ఒక పాఠం నేర్పింది : నాగార్జున

Saturday, May 26th, 2018, 12:57:35 AM IST


యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆఫిసర్ చిత్రంలో, అలానే నాచురల్ స్టార్ నాని తో కలిసి ఒక మల్టి స్టారర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నాగార్జున మాట్లాడుతూ, దివంగత ప్రఖ్యాత నటి శ్రీదేవి మరణవార్త తనను ఎంతగానో కలచి వేసిందని, గోవిందా గోవిందా, ఆఖరిపోరాటం చిత్రాల లో తనతో కలిసి నటించిన రోజులు ఎన్నటికీ మరువలేనని అన్నారు. ఆమె మరణం మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమకే ఒక పెద్ద తీరని లోటని అన్నారు. ఒక సారి కెమెరా స్విచ్ ఆన్ చేస్తే తాను చేసే పాత్రలో లీనమయ్యే శ్రీదేవి, అదే కెమెరా స్విచ్ ఆఫ్ అవ్వగానే రియల్ లైఫ్ లోకి వచేసేవారని, సెట్ లో ఆమె ఉన్నంతసేపు ఒక తోటి నటి వుంటున్నట్లే ఉండేదని, అంతేతప్ప ఆమె ఎన్నడూకూడా ఒక గొప్ప స్థాయిలో వున్న నటిలా ఫీల్ అయ్యేది కాదని చెప్పుకొచ్చారు.

ఎందుకంటె అప్పట్లో ఆమె కేవలం బాలీవుడ్ లోనే కాదు, తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా లీడింగ్ యాక్ట్రెస్ అని, నిజానికి ఆమెని ఒక లేడీ సూపర్ స్టార్ అని అనాలని అయన అన్నారు. ఆమె మరణించిందంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నానని, తన జీవితంలో ఒక గొప్ప స్నేహితురాలిని మిస్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆమె మరణం తనకు జీవితంలో ఒక పాఠాన్ని నేర్పిందని, అందువల్ల తనకు ప్రియమైన, తన మనసుకు దగ్గరైన వారికి మరింత దగ్గరగా, చేరువగా ఉంటున్నానని, జీవితం ఎంతో అందమైంది, ఎప్పుడు ఎవరికి, ఏమి జరుగుతోందో చెప్పలేమని అన్నారు. మళ్ళి అటువంటి గొప్ప నటి పుట్టదని, ఎక్కడున్నా ఆమె ఆత్మకు ఆ భగవంతుడు శాంతిని చేకూర్చాలని అన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments