రాజకీయాల్లో మార్పుకోసమే ఆ పదవి వదులుకున్నాను : కోదండరాం

Sunday, May 13th, 2018, 04:02:26 PM IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఐక్య కార్యాచరణ సమితి భాగస్వామ్యం మరువలేనిది. వారు చేపట్టిన కార్యక్రమాలు, ప్రజానిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమాలు, రాష్ట్రం సాధించడం పట్ల ప్రజలకు అవగాహన కల్గించడంవంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది ఐకాస. అయితే ఐకాస చైర్మన్ గా వున్న ప్రొఫెసర్ కోదండ రామ్ తన పదవికి రాజీనామా చేశారు. కాగా నేడు తార్నాకలోని సెయింట్ ఆన్స్ కన్సొలేట్ తెలంగాణ విస్తృత స్థాయి భేటీలో భాగంగా ఆయన రాజీనామాను సభ్యులు ఆమోదించారు. దీనిపై కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో ఐకాస ముఖ్యపాత్ర పోషించిందని,

ఇటువంటి సంస్థ మన దేశంలో ఎక్కడా కూడా లేదని, తమని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప సంస్థ ఇదని ఐకాస ని ఆయన పలువిధాలుగా కొనియాడారు. ఆయన పదవిలో ఉండగా ఐకాసకు ఎందరో పలుపలు విధాలుగా సహకరించారని, అటువంటి వారి సహాయం ఎన్నటికీ మరువలేమన్న్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఈ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ప్రజల ముందుకు న్యాయమై పాలన తేవడంకోసమే తాను తెలంగాణ జన సమితి పార్టీని ఏర్పాటు చేసానని అన్నారు. ప్రజలే ప్రభువులని,ప్రజలకు అన్నివిధాలుగా మేలు చేసేవిధంగా తమ పార్టీ మానిఫెస్టో ఉంటుందని ఆయన అన్నారు……