యాక్సిస్ బ్యాంకులో నల్ల బాగోతం.. రూ 40 కోట్లు ఒకే అకౌంట్లు లోకి..!

Monday, November 28th, 2016, 03:40:56 PM IST

money
నల్ల ధనాన్ని అరికట్టడానికి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా సరిపోవేమో..ఈ నల్ల బాబుల ఆగడాల ముందు. దీనికి తోడు ఇంటి దొంగలే వీరికి సహకరిస్తున్నారు. బ్యాంకు అధికారులే నల్ల దొంగలకు సహకరిస్తూ వారి నల్ల ధనాన్ని యధేచ్చగా మార్చేస్తున్నారు. ఢిల్లీ లోని కాశ్మీర్ గెట్ యాక్సిస్ బ్యాంకు నుంచి ఓ అకౌంట్ లోకి ఏకంగా 40 కోట్లు డిపాజిట్ అయ్యాయి.దీనితో ఈ మొత్తాన్ని ఎవరు డిపాజిట్ చేసారో అని అధికారులు ఆరా తీస్తున్నారు. ఈస్థాయిలో పాత నోట్లు రావడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.

దీనితో యాక్సిస్ బ్యాంకుకు చెందిన ఇద్దరు అధికారుల ఇళ్లలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.వీటి ప్రకారం రూ 40 కోట్లు డిపాజిట్ చేసిన వారికి బ్యాంకు అధికారులే సహకరించారని ఐటి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సాయం చేసినందుకు రూ 40 కోట్లని డిపాజిట్ చేసిన వారు బ్యాంకు అధికారులకు 40 లక్షలు కమిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నవంబర్ 11 నుంచి 22 తేదీ మధ్య రూ 40 కోట్లని డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది.బ్యాంకు సమయం అయిపోయాక వారిని పిలిచి ప్రత్యేక అకౌంట్ ని క్రియోట్ చేసి అందులో ఈ మొత్తాన్ని జమ చేసినట్లు తెలుస్తోంది. ఆ తరువాత దానిని వేరే అకౌంట్ల లోకి మార్చి బ్లాక్ ని వైట్ గా మార్చుకుంటుంన్నారు. కానీ యాక్సిస్ బ్యాంకు ప్రతినిధులు మాత్రం అదేం లేనట్లు బుకాయిస్తున్నారు.