మళ్ళీ వికసించనున్నకమలపువ్వు- అదే ప్రజల ఆకాంక్ష- మోడీ

Saturday, January 12th, 2019, 04:30:19 PM IST

ఢిల్లీలోని రాంలీలా మైదానం లో ఏర్పాటు చేసిన బీజేపీ జాతీయ సమ్మేళనంలో పాల్గొన్న ప్రధాని మోడీ మళ్ళీ తామే అధికారంలోకి రావడంఖాయమని ఆశాభావం వ్యక్తంచేశారు. దేశ ప్రజలందరూ కూడా బీజేపీ వైపే చూస్తున్నారు. మనదేశంలో అవినీతి రహితపాలన అందించిన ఘనత బీజేపీ కె దక్కుతుందని మోడీ అన్నారు. ప్రజలందరూ కూడా బీజేపీ పై నమ్మకం పెంచుకున్నారు. ఎందరో కార్యకర్తల త్యాగాల వలన నేడు బీజేపీ ఈ స్థానంలో ఉందని మోడీ తెలిపారు.

ఇంతకు ముందున్నపార్టీలు అన్ని కూడా అవినీతి పాలనను అందించాయి. వారి పాలనతో విసిగిపోయి మా పార్టీని గెలిపించుకున్నారు. మేము ప్రజలకి అన్ని విధాలుగా సహాయంచేశాం. ఇక మీదట కూడా ప్రజలను ఆదుకుంటాము. అంతే కాకుండా ఉన్న రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించామని ఆయన పేర్కొన్నారు. నేటి యువతకు అద్భుతాలు చేయగల శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని తెలిపారు. సబ్‌ కా సాత్‌ అనేది సర్కార్‌ ఒకదాని వల్ల కాదు. ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఉండాలి అని ప్రధాని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి లో అసలే వెనకడుగు వేయబోమని మోడీ స్పష్టం చేశారు.