నా కూతురిని కావాలనే నరికా..!

Thursday, September 20th, 2018, 03:46:02 PM IST

కులాంతర వివాహాలు చేసుకున్నారన్న నేపధ్యంలో ఒక కసాయి తండ్రి తన అల్లుడిని కడ తేర్చాడు,మరో కసాయి తండ్రి తన కూతురునే చంపుదాం అనుకున్నాడు.మానవత్వం మరిచిపోయి కన్న బిడ్డనే కడతేర్చాలని మనోహరాచారి అనే ఒక తండ్రి అత్యంత దారుణంగా తన కన్న కూతురి మీదనే కత్తి దూసాడు.తప్పుగా తాగిన మైకంలో చేసాడు అని అనుకుంటే పొరపాటే తాను కావాలనే తన కూతురిని చంపుదాము అనుకున్నాను అని అస్సలు ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా నిక్కచ్చిగా చెప్పాడు.

ప్రణయ్ అమృతల ప్రేమ విషయంలోనే నానా అల్లకల్లోలంగా ప్రజలు ఉంటే ఆ ఉదంతాన్ని,మారుతీరావుని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి కుల రాక్షసులు మరింత చెలరేగిపోతున్నారు.ఎందుకని నీ కూతురుని చంపాలనుకున్నావు అని అడిగితే తన కూతురు కులాంతర వివాహం చేసుకోడం తనకి ఇష్టం లేదు అని,తనకి చెప్పకుండానే ఆ పెళ్లి చేసేసుకుంది అని అందుకనే కావాలనే చంపేద్దాం అనుకున్నాని అస్సలు తప్పు చేశాను అని ఏ మాత్రం చింత లేకుండా మనోహరాచారి సమాధానం ఇచ్చాడు.ఇలాంటి దుశ్చర్యలకు వారి తల్లులు కూడా మద్దతు పలుకుతున్నారని బాధిత ప్రేమికులు వాపోతున్నారు.