నేను కావాలని అలా అనలేదంటున్న టీడీపీ ఎంపీ …..

Saturday, May 26th, 2018, 03:00:42 AM IST

రాజమహేంద్రవారంలో నిన్న జరిగిన మినీ మహానాడులో ఒక విషయం చర్చ నియాంశంగా మారింది.ఆ విషయం ఏంటంటే, టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ గారు ఒకానొక సందర్భంలో “వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి “ అని సంబోధించారు. దాంతో ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది, అంతే కాకుండా అందుకు సంబందించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.

ఐతే ఆ విషయం అలా ఉంచితే, దీనిపై స్పందించిన మురళి మోహన్ గారు, నేను కావాలని వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి అలా అనలేదని, ఆ సందర్భం లో బుచ్చయ్య చౌదరి గారితో మాట్లాడుతున్నాను, దానితో ఆ మాట అలా బయటకు వచ్చిందితప్ప, కావాలని దేవుడికి కులాన్ని అంటగట్టే అంత తప్పుడు మనిషిని కాను అని ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఈ విషయం ఫై దేవుడికి కూడా దణ్ణం పెట్టుకునే ప్రతి సారీ క్షమాపణ కూడా చెప్పుకున్నానని వివరణ ఇచ్చారు..

  •  
  •  
  •  
  •  

Comments