తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తా: శంకర్

Wednesday, December 31st, 2014, 03:24:17 AM IST

shankar
సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయలనుకుంటున్నట్టు తన మనసులోని మాట బయటపెట్టారు. గతంలో రెండు సందర్భాల్లో ప్రయత్నించినా వీలు కాలేదని శంకర్ గుర్తుచేశారు. శంకర్ తన దర్శకత్వంలో రూపొందించిన ‘ఐ’ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో కలర్ ఫుల్ గా జరిగింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్ తో పాటు విక్రమ్ కూడా మాట్లాడారు. సినిమాల పట్ల తెలుగు ప్రేక్షకులకున్నంత ఇష్టం ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదని ప్రశంసించాడు నటుడు విక్రమ్. గతంలో తన సినిమాలను ఎంతో ఆదరించారని గుర్తుచేశాడు. ఐ సినిమాలో తన పాత్ర కోసం గంటలకొద్దీ మేకప్ లో గడపాల్సి వచ్చిందని చెప్పాడు. పాత్రకు తగ్గట్టు బాగా లావు కావడం, సన్నబడటం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందన్నాడు.

ఈ ఆడియో రిలీజ్ వేడుకలో నటుడు విక్రమ్, దర్శకుడు శంకర్, గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, శ్రీరామ్, చంద్రబోస్, దర్శకుడు రాజమౌళి, త్రివిక్రమ్, నిర్మాత బోయపాటి శ్రీనులతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.