ఈ సారి పక్కా సాక్ష్యాధారాలతో లోకేష్,బాబుల అవినీతి బయటపెడతా.!

Thursday, September 27th, 2018, 10:22:58 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి మరియు ఆయన తనయుడు నారా లోకేష్ అవినీతికి పాల్పడుతున్నారని,ఈ మధ్య బీజేపీ పార్టీ నాయకులు కాస్త గట్టిగానే ఆరోపిస్తున్నారు.వీళ్ళే కాకుండా చంద్రబాబు మరియు లోకేష్ సహా ఇంకో నలుగురు వీరికి సహకారంగా అవినీతికి పాల్పడుతున్నారని న్యాయవాది శ్రవణ్ కుమార్ వారి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ హై కోర్టులో కేసు పెట్టిన సంగతి తెలిసినదే,అయితే నిన్ననే ఈ కేసుకి సంబంధించి సరైన ఆధారాలు సమర్పించలేదని,కేసుని కొట్టివేశారు.

దీనిపై శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా తాను ఇంకా చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ మీద చేస్తున్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు తెలుపుస్తున్నారు.ప్రయివేట్ కంపెనీల పేరిట వారికి వేల ఎకరాలు కేటాయించారని,దాని వెనుకున్న అంతరార్ధం ప్రకారం అక్కడి ఉద్యోగాలను భర్తీ చెయ్యాలని,దాని నిమిత్తం ప్రశ్నించగా వారు ఇప్పటికే 32లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారని తెలిపారు.కానీ వాటి తాలూకా ఆధారాలు,ఉద్యోగం పొందిన వారి జాబితా పొందుపరచమంటే దాటవేస్తున్నారని తెలిపారు,అంతే కాకుండా అలా పెట్టినటువంటి ఉద్యోగాలకు ఆన్లైన్ తరహాలో జీతం చెల్లిస్తున్నట్టుగా దాదాపు 25 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని తెలిపారు,దీనిపై ఈ సారి పక్కా ఆధారాలతో హై కోర్టులో పిటీషను దాఖలు చేసి ఒకటి లేదా రెండు నెలల్లో హై కోర్టు ద్వారానే సిబిఐ విచారణ జరిపిస్తామని తెలిపారు.