నేను పేరుకోసమో పదవులకోసమో పోరాడటంలేదు :కేసీఆర్

Sunday, April 29th, 2018, 10:54:46 AM IST

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం తమ పార్టీని ప్రజల్లోకి ఏవిధంగా మరింత ముందుకు తీసుకెళ్ళాలి అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీ శ్రేణులను తరచు కలుస్తూ చేపట్టిన, చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. మొన్న తెలంగాణ ప్లీనరీ నిర్వహించి కార్యకర్తల్లో గట్టి మనోధైర్యం నింపిన ఆయన నిన్న పార్టీ ప్రగతి భవన్ లో వివిధ దేశాల ఎన్నారై ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ తనపై దుష్ప్రచారం జరుగుతోందని, దానిపై అపార్ధం చేసుకోవద్దని అన్నారు. దేశరాజకీయాల్లో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టామని, తాము చేస్తున్న ఈ ప్రయత్నాలకు ఎన్నారై సోదరులు కూడా తమ వంతు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు సమావేశాల ఏర్పాటుతో సహకరించాలని కోరారు.

తాను నిజానికి పదవుల కోసమో, పేరుకోసమో లేక మరొకదానికోసమే పోరాడడం లేదని అన్నారు. మార్పు కోసం తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. మనకి ఎందుకులే అనుకుంటే తెలంగాణ సాధించేవాళ్లమా, మనకి ఎందుకులే అనుకుంటే ఎటువంటి మార్పు కూడా జరగదని, అందువల్ల ప్రయత్నం చేస్తూ ఉండాలి అన్నారు. దేశప్రజల అభ్యున్నతికోసం ఒక అజెండా రూపొందిస్తున్నామని, దీనిని అందరూ ఆమోదిస్తారని ఆశ భావం వ్యక్తం చేశారు. మన దేశ బడ్జెట్ రూ.24.47లక్షల కోట్లు, అందులో రూ.10లక్షల కోట్లు జీతభత్యాలు, పెన్షన్లు తదితరాలకుపోతుందని, మరొక రూ.8.47లక్షల కోట్లు అప్పుల తాలూకు వడ్డీలకు పోతుందని, మరొక రూ5.50లక్షల కోట్లు కేంద్ర ప్రాయోజిత పథకాలకు పోతుందని అన్నారు. ఇకమిగిలేది లక్షన్నర నుండి రెండు లక్షల కోట్లు. ఈ డబ్బుతో కొన్ని కోట్ల ప్రజలున్న మన దేశంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఏం మేరకు జరుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేసారు.

ఇలా చేసుకుంటూ పోతే మన దేశం ఎప్పుడు బాగుపడాలి, ఎలా బాగుపడాలి అన్నారు. దేశంలో ఎక్కడ చూసిన అశాంతి, అసంతృప్తి, మాత, కుల ఘర్షణలు. వీటికి ముగింపు ఎప్పడు అన్నారు. ఈ ప్రకారం చూస్తే మన దేశం ఇతర దేశాల కంటే చాలా చాలా వెనుకపడి ఉందని అన్నారు. ఈ సరి ఎన్నికల్లో మోడీ గెలవారని అంటున్నారని, అయితే మాత్రం కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ వస్తారు. ఆయన మాత్రం చేసేది ఏముందని పెదవి విరిచారు. ఒకరి మీద కోపంతో మరొకరికి ఓటు వేసి గెలిపిస్తున్నామే తప్ప మనకి మన దేశానికి ఏమి కావాలి, ఎటువంటి అభివృద్ధి కావాలి అనే దానిపై అందరం ఆలోచించి ఒక గుణాత్మక మార్పు దిశగా శ్రీకారం చుట్టాలి అని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments