సుజనా చౌదరి సవాల్ కు నేను సిద్ధం : జివిఎల్ నరసింహారావు

Friday, July 27th, 2018, 03:51:34 AM IST


ఏపీకి విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయమై గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని బీజేపీ పూర్తిగా విస్మరించిందని టీడీపీ నేతలు నాయకులు మొన్న టీడీపీ తరపున లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అది వీగిపోవడంతో, అంతటితో అవ్వలేదని, ఇకపై రానున్న రోజులో రాష్ట్రానికి రావలసినవాటిపై మరింత కఠినతర పోరాటం చేస్తామని టీడీపీ నేతలు నాయకులూ అంటున్నారు. ఇక ప్రస్తుతం ఇప్పటికే అటు బీజేపీ మరియు ఇటు టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరుతోంది. ఇక నేడు ఈ విషయమై మాట్లాడిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ నేతలు మొదటి నుండి ఒకే మాటలు చెపుతున్నారని, రాష్ట్రానికి ఏమి చేయకుండా ఏదో చేసినట్లు రాష్ట్ర ప్రజల ముందు కల్లబొల్లి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

ఇక బీజేపీ నేత జివిఎల్ నరసింహ రావు అయితే పారిశ్రామికి కారిడార్ పేరుతో మమ్మల్ని మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. మేము రాజ్యాంగం ప్రకారమే ఏపీకి రావలసిన నిధులను అడుగుతున్నామని, మీరు హోదా, హామీలు నిజంగా ఇవ్వదలిస్తే ఇప్పటికిప్పుడు అమలు చేయవచ్చని, కానీ ఏమి చేయకుండా అన్ని చేసినట్లు అసత్యాలు ఎందుకు పలుకుతున్నారని, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, తనతో చర్చకు రావాలని సవాలు విసిరారు. ఇక కాసేపటి క్రితం స్పందించిన నరసింహారావు, సుజనా చౌదరి గారు మీరు విసిరినా సవాలుకు నేను సిద్దమే ఈ అంశాలపై చర్చిందెకు ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పమంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం వీరి మధ్య జరుగుతున్న ఈ సవాళ్లు ప్రతిసవాళ్లు ఎక్కడివరకు వెళతాయో చూడాలి మరి…