రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పై పోటీకి సిద్ధం : ప్రముఖ రచయిత

Sunday, April 29th, 2018, 03:28:41 PM IST

ట్రంప్ నియంతృత్వ విధానాలవల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆయన చేపట్టే సంస్కరణలపై రోజురోజుకీ వ్యతిరేకత ఎదురవుతోందని ప్రముఖ రచయిత బ్రాడ్ థార్ అన్నారు. ట్రంప్ ని వ్యతిరేకించేవాళ్ళలో రచయిత బ్రాడ్ థార్ కూడా ఒకరు. గత కొద్దిరోజులుగా ట్రంప్ పై ట్విట్టర్లో ఆరోపణలలు చేస్తున్న ఆయన డోనాల్డ్ ట్రంప్ ఫై రానున్న ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధమని బ్రాడ్ థార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆయన పాలన మెరుగ్గా ఉంటే వేరొకరు ఆయనపై పోటీకి సై అనరుకదా అని అన్నారు. అమెరికా చాలా గొప్ప దేశంకాబట్టే ఉన్నత స్థాయిలో వుంది. అదేవిధముగా దేశాన్ని పాలించే నాయకుడు కూడా ఉత్తమంగా వ్యవహరించాలనేది ఆయన ఉద్దేశం.

అయితే థార్ పోటీ విషయమై ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ ను సంప్రదించగా అధ్యక్ష పదవికి ఆయన తనపేరుని తమవద్ద నమోదు చేసుకోలేదని వారు చెప్పారు. ప్రభుత్వం గురించి, ప్రజల గురించి పట్టించుకోలేని వాడు నాయకుడుగా పనికిరాడు, ప్రజలకు సమర్ధవంతమైన సుపరిపాలన అందాలంటే వెంటనే ఇటువంటి అసమర్ధ నాయకులను తరిమి కొట్టాలి అని ఆయన ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. వాస్తవానికి ఇప్పటివరకు ట్రంప్ మీద పోటీ చేయడానికి ఇప్పటివరకు పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాలేదని, అయితే మొన్నామధ్య ప్రముఖ టెలివిజన్ హోస్ట్ ఓప్రా విన్ఫ్రీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తాను ట్రంప్ పై పోటీకి సిద్ధమని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments