అందరికంటే ముందు ప్రశ్నించాల్సిన బాధ్యత నాదే : పవన్

Sunday, February 11th, 2018, 11:24:42 PM IST


ఆంధ్రప్రదేశ్ కు ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నిధుల కేటాయింపు సరిగా లేదని, క్లిష్ట పరిస్థితుల్లో విభజన జరిగిన విషయం తెలిసికూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం సాయం చేయడంలేదని టిడిపి నేతలు పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అలానే ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా రాష్ట్రనికి జరిగిన అన్యాయం పై ఒక రోజు రాష్ట్ర బంద్ పాటిచండం ద్వారా మద్దతు తెలిపాయి. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయమై మాట్లాడుతూ కేంద్ర నేతలని అడిగితే అన్ని రాష్ట్రాలకంటే ఏపీ కె ఎక్కువ కేటాయింపులు చేశామంటున్నారని, కానీ అధికార టిడిపి నేతలేమో రాష్ట్రానికి రావలసినవేవి సక్రమంగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

అయితే ఇదేం అంశం పై తాను ఒక జేఏసీ ని ఏర్పాటు చేయదలచినట్లు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ జేఏసీ మాజీ కాంగ్రెస్ రాజముండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్సత్తా అధ్యక్షులు జేపీ తో ఏర్పాటు చేయదలచినట్లు, ఇందు నిమిత్తమై ఆయన మొన్న జెపి ని కూడా కలిశారు. అయితే ఇదే అంశంపై నేడు ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ ను ఆయన పార్టీ ఆఫీస్ లో కలిశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ గతంలో తాను ఏవైతే మాట్లాడానో, ఈ మధ్య కాలంలోవాటిపైనే రాష్ట్రప్రభుత్వం గొడవలు చేయడం చూసి ఇప్పటిదాకా కాలయాపన ఎందుకు చేశానా అని బాధేసిందన్నారు. రెండు పార్టీలు న్యాయం చేయలేని పక్షంలో తనవంతు బాధ్యతగా వారిని ప్రశ్నించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.

అందరికంటే ముందు తాను బాధ్యతగా భావిస్తున్నానని, తనను ఎవరూ రాజకీయాల్లోకి రావాలని చెప్పలేదని తనకు స్వతహాగా అనిపించి ప్రజలకోసం వచ్చానన్నారు. అంతకుముందు జరిగిన అవకతవకలేమైనా ఉంటే అటు ప్రధానిగా నరేంద్రమోదీ ఇటు అనుభవమున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే చాలా మేలు జరుగుతుందని భావించి 2014లో వారిద్దరికీ తన మద్దతు ప్రకటించినట్లు చెప్పుకొచ్చారు. అయితే రెండు పార్టీల విభిన్న స్వరాలు వింటుంటే ప్రజల మాదిరి తనకూ అంతా గందరగోళంగా ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీతో విభేదించి రాజకీయాల నుంచి వైదొలిగి అస్త్రసన్యాసం చేసిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ గారైతే ప్రజల సమస్యలను తటస్థంగా చూడగలరని భావించినట్లు చెప్పారు. అందుకే ఉండవల్లి, జేపీ ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అటు కేంద్రం వారు ఎంత కేటాయించారో, ఇటు రాష్ట్రం వారికి ఎంత అందాయి అంటున్నారో వాటి నివేదికలు తనకు ఇస్తే వాటిని కమిటీకి అందచేసి అసలు జరిగినది తెలుసుకుని లోటుపాట్లు సరి చేయవచ్చని విజ్ఞప్తి చేశారు….

  •  
  •  
  •  
  •  

Comments