చిన్నప్పటినుండి అతన్ని ఇబ్బంది పెడుతున్నా : ఛార్మి

Monday, April 30th, 2018, 10:17:36 PM IST


మంత్ర చిత్రంతో టాలీవుడ్ లో మంచి లేడీ ఓరియెంటెడ్ హారర్ చిత్రాలకు గుర్తింపు తీసుకొచ్చిన నటి చార్మీ. ఆతరువాత ఆమె అటువంటి చిత్రాలైన మంగళ, మంత్ర 2 చేసింది, కానీ అవి అంత బాగా ఆడలేదని చెప్పాలి. అయితే గత కొద్దికాలంగా ఆమె నటించడం లేదు. కాగా ఇటీవల వచ్చిన 10 చిత్రంలో ఒక కామియో అప్పీయరెన్సు ఇచ్చారు. ఇక ఆ తరువాత ఆమె ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ స్థాపించిన పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఆయనతో కలిసి చిత్రాలు నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఆమె రోగ్, పైసా వసూల్, మెహబూబా చిత్రాలు నిర్మించారు. అందులో మెహబూబా విడుదలకు సిద్ధంగా వుంది.

అయితే ఆమె సోషల్ మీడియా లో మాత్రం యాక్టివ్గా వుంటూ తన చిత్రాల, అలానే లైఫ్ కు సంబందించిన విషయాలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. నేడు ఆమె తన సోదరుడితో కలిసి చిన్నపుడు బెడ్ మీద నిద్రపోతున్న ఫోటో ఒకటి పోస్ట్ చేశారు. ‘నా సోదరుడి మీద పడుకున్న, తనని అప్పటినుండి ఇప్పటివరకు ఇబ్బంది పెడుతున్నా’ అంటూ ట్వీట్ చేశారు. చిన్నప్పటి జ్ఞాపకాలు మరువలేనివి అని ఛార్మి పెట్టిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. కాగా పూరి కనెక్ట్స్ పై నిర్మించిన మెహబూబా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఆ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది….

  •  
  •  
  •  
  •  

Comments