హైదరాబాద్ లో ఐబీఎల్ సందడి

Monday, August 26th, 2013, 10:35:15 AM IST

ibl-hyderabad-team
బ్యాడ్మింటన్‌లో కొత్తదనానికి శ్రీకారం చుట్టిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ఇప్పుడు నగర అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. సోమవారం నుంచి బుధవారం వరకు నగరంలో ఐబీఎల్ మ్యాచ్ జరగనున్నాయి. తొలి రోజు అవధె వారియర్స్, పుణె పిస్టన్స్ తలపడనున్నాయి. మంగళవారం హైదరాబాద్ హాట్ షాట్స్ బంగా బీట్స్ తో తలపడనుంది. బుధవారం ఐబీఎల్ తొలి సెమీ ఫైనల్ కూడా హైదరాబాద్ లో జరుగుతుంది. అవధె జట్టులో సింధు, గురుసాయిదత్, శ్రీకాంత్, నందగోపాల్, మనిషా.. పుణె జట్టులో అశ్విని పొన్నప్ప ఉన్నారు.

ఐబీఎల్ లో నేడు
సోమవారం : అవధె వారియర్స్ x పుణె పిస్టన్స్
మంగళవారం : హైదరాబాద్ x బంగా బీట్స్
బుధవారం : తొలి సెమీ ఫైనల్

గత కొన్నేళ్లుగా అనేక మంది అంతర్జాతీయస్థాయి ఆటగాళ్లను అందించి షటిల్ క్రీడకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌లో తొలి సారి లీగ్ మ్యాచ్‌లు జరగనుండటం ఆసక్తి రేపుతోంది.