ప్రమోషనల్ సాంగ్ వైరల్ : వరల్డ్ కప్ సందడి మొదలైందిగా!

Wednesday, August 8th, 2018, 02:45:01 PM IST

ఎన్ని టీ20 మ్యాచ్ లు జరిగినా కూడా వన్డే వరల్డ్ కప్ కు ఉండే ఆధరనే వేరు. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్ పై కూడా భారీ అంచనాలున్నాయి. బాంగ్లాదేశ్ – ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్లు కూడా గట్టి పోటీని ఇస్తాయని చెప్పవచ్చు. రౌండ్ రాబిన్, నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో మొత్తం 14 టీమ్ లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. ఇకపోతే ఐసిసి అధికారిక ట్విట్టర్ లో టోర్నీకి సంబందించిన ఒక ప్రమోషనల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ లీడ్ రోల్ లో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ‘ఆన్ టాప్ ఆప్ ది వరల్డ్’ అనే ఈ ప్రమోషనల్ సాంగ్ లో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర, మహిళా క్రికెటర్ చార్లొటె ఎడ్వర్డ్స్ కూడా సందడి చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments