చాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్ నేడే

Wednesday, June 19th, 2013, 12:06:31 PM IST

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ పోరుకు తెరలేచింది. నేటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్స్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతుంది. రెండో సెమీఫైనల్ భారత్ – శ్రీలంక జట్ల మధ్య గురువారం నాడు కార్డిఫ్ లో జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ ఈనెల 23వ తేదీన ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతుంది.

ఇంగ్లాండ్ జట్టు ఇప్పటిదాక ఐసిసి నిర్వహించే వన్డే టోర్నీలో టైటిల్ గెలవలేదు. స్వదేశంలో కప్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.అలెస్టర్ కుక్ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. కుక్, ఇయాన్ బెల్, నాథన్ ట్రాట్, రూట్ బ్యాటింగ్ విభాగంలో రాణిస్తున్నాడు. లీగ్ దశలో తొలి రెండు గేముల్లో భారీ స్కోర్లు చేసిన సంగతి తెలిసిందే. బౌలింగ్ మెరుగు పరుచుకుంటే గెలుపు ఖాయమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణాఫ్రికా జట్టు విషయానికొస్తే.. హషీం ఆమ్లా, డివిల్లీర్స్, డ్యూమినీ, డ్యూప్లెసిస్, మిల్లర్ లపై ఆధారపడి ఉంది. వీరు బ్యాటింగ్ ఝులిపిస్తే భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది. నిలకడతనం లోపించడం వల్ల సౌతాఫ్రికా కష్టాలు ఎదుర్కోంటోందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.