మొదటి స్థానాన్ని కోల్పోయిన టీమిండియా!

Wednesday, May 2nd, 2018, 04:57:20 PM IST

గత ఏడాది కోహ్లీ న్యాయకత్వంలో టీమ్ ఇండియా మంచి ఆటతీరును కనబరచి టెస్టుల్లో (125 పాయింట్లు) వన్డేల్లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అయితే నిన్నటి వరకు వన్డేల్లో అదే ర్యాంక్ (123) లో కొనసాగిన ఇండియా తాజాగా ఐసిసి ప్రకటించిన ర్యాంక్ లలో ఒక పాయింట్ కోల్పోవడంతో రెండవ స్థానానికి పడిపోయింది. చాలా కాలం తరువాత మహేంద్ర సింగ్ ధోని భరత టీమ్ ను తన కెప్టెన్సీ లో మొదటి స్థానానికి తెచ్చాడు. ఆ తరువాత కోహ్లీ కూడా అదే తరహాలో కొనసాగేలా విజయాలను అందించాడు. అయితే భారత్ కంటే ఎక్కువ స్థాయిలో ఇంగ్లాండ్ జట్టు మంచి ఆటతో గత రెండుళ్లుగా విజయాలను అందుకుంటోంది. అందువల్ల 8 పాయింట్లను తెచ్చుకొని వన్డేల్లో 125 పాయింట్లతో వరల్డ్ నెంబర్ వన్ వన్డే టీమ్ గా నిలిచింది. 2015 -16, 2016-17 సీజన్లను మాత్రామే పరిగణలోకి తీసుకొని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ ర్యాంక్ లను ప్రకటించింది.

ఇక తరువాతి స్థానాల్లో ఉన్న జట్లు;

3. దక్షిణాఫ్రికా (113)
4.న్యూజిలాండ్‌ (112)
5. ఆస్ట్రేలియా (104)

టీ20 ర్యాంకింగ్స్‌లో

1.పాకిస్థాన్ (130)
2.ఆస్ట్రేలియా (126)
3.భారత్‌ (123)
4.న్యూజిలాండ్‌ (116)
5.ఇంగ్లాండ్‌ (115)