ధోనీతో గేమ్స్ వ‌ద్దు.. ఐసీసీ స్ట్రాంగ్ వార్నింగ్..!

Monday, February 4th, 2019, 06:57:35 PM IST

టీమ్ ఇండియా తాజాగా న్యూజిలాండ్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో 4-1 తేడాతో జ‌య‌భేరి మోగించిన సంగ‌తి తెలిసిందే. సిరీస్ మొత్తం స‌మిష్టిగా రాణించిన భార‌త్ విదేశీ గ‌డ్డ పై వ‌రుస‌గా మ‌రో సిరీస్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. స్టంపౌట్లు చేయ‌డంలో ప్ర‌స్తుత అంత‌ర్జాతీయ క్రికెట్‌లో దోనీని మించిన మొన‌గాడు లేడ‌నే చెప్పాలి. మెరుపువేగంతో సెక‌న్లు టైమ్‌లో బెయిల్స్ గిరాటేసి బ్యాట్స్‌మెన్స్‌కు పెవిలియ‌న్ దారి చూపిస్తాడు. స్టంపౌట్లు చేయ‌డంలో ధోనీ స్టైలే వేరు, ఇక ర‌నౌట్స్ చేయ‌డంలో కూడా ధీనీ మంచి దిట్ట‌.

ఇక తాజా సిరీస్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ రాస్ టేల‌ర్‌ను రెప్ప‌పాటులో స్టంప్ అవుట్ చేసి, ఇంటికి పంపించిన ధోనీ, చివ‌రి వ‌న్డేలో ఊహించ‌ని విధంగా ర‌నౌట్ చేసి, మ‌రో కివీస్ బ్యాట్స్‌మ‌న్‌ను పెవిలియ‌న్‌కు పంపాడు. రెండు టీమ్‌లు గెలిచేందుకు స‌మాన అవ‌కాశాలు ఉన్న టైమ్‌లో మంచి ఊపుమీద ఉన్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ నీశ‌మ్ అప్ప‌టికే వ‌రుస బౌండ‌రీల‌తో ప్ర‌మాధక‌రంగా మారాడు. అయితే మ్యాచ్ మంచి పీక్స్‌లో ఉన్న టైమ్‌లో నీశ‌మ్ చిన్న వేమ‌ర‌పాటు వ‌ల్ల అత‌నితో పాటు న్యూజిలాండ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది.

కేధార్ జాద‌వ్ బౌలింగ్‌లో బాల్ నీశ‌మ్ ప్యాడ్‌కు త‌గ‌ల‌గా ధోనీతో స‌హా అంద‌రూ అపీల్ చేస్తున్నారు. బంతి వికెట్ల వెనుక ధోనీకి కొంత దూరంలో ఉండ‌డంతో నీశ‌మ్ ర‌న్‌కోసం ముందుకు క‌దిలాడు. దీంతో వెంట‌నే బాల్ అందుకున్న ధోనీ డైరెక్ట్‌గా బాల్‌ను వికెట్ల‌కు విస‌ర‌డంతో మైండ్ బ్లాక్ అయిన నీశ‌మ్ నిరాశ‌గా పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. ఇక ఈ వీడియో అయితే సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది. ఎంతలా అంటే ధోనీ చేసిన ర‌న్ అవుట్ పై ఏకంగా ఐసీసీ సైతం స్పందించి అంద‌రికీ షాక్ ఇచ్చింది. మ‌హేంద్ర సింగ్ ధోనీ వికెట్ల వెనుకాల ఉంటే, ఎలాంటి బ్యాట్స్‌మెన్ అయినా క్రీజు వ‌దిలి వెళ్ళొద్ద‌ని, లేక‌పోతే రిజ‌ల్ట్ తారుమారు అయిపోతుంద‌ని ట్వీట్ చేసింది. దీంతో ఐసీసీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.