ఐడియా ప్రవేశపెట్టిన కొత్త ఐడియా

Tuesday, May 29th, 2018, 02:50:25 PM IST

ప్రస్తుతం టెలికాం రంగాల మధ్య ఏ స్థాయిలో పోటీ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కంపెనీలు పోటా పోటీగా ఆఫర్లను ప్రకటిస్తూ బిజినెస్ డల్ కాకుండా చేసుకుంటున్నాయి. గత కొంత కాలంగా ఎయిర్ టెల్ ఒక్క కంపెనీ జియో కి గట్టి పోటీని ఇస్తూ తన కస్టమర్స్ ని పోనివ్వకుండా చూసుకుంటోంది. అదే తరహాలో వోడాఫోన్ కూడా గట్టి ప్రయత్నమే చేసి 4జి సేవలలో మంచి ఆఫర్స్ ను ప్రకటిస్తూ వస్తోంది. కానీ ఐడియా మాత్రం ఇంకా పోరాడుతూనే ఉంది. అసలే ఆ కంపెనీ ఊహించని నష్టాలను చూసింది. మళ్లీ తన కస్టమర్స్ ను వెనక్కి తీసుకోవాలని కృషి చేస్తోంది.

అందుకే కొత్త తరహాలో డేర్ చేసి ఉచిత డేటా ను సరికొత్తగా అందిస్తోంది. ఇటీవల ప్రారంభించిన ఐడియా 4జీ వోల్టే సేవలకు మంచి స్పందన వస్తోంది. దేశవ్యాప్తంగా 15 సర్కిళ్లలోకి అందుబాటులోకి తెచ్చినట్లు ఐడియా కంపెనీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తో కలిపి ఆరు సర్కిళ్లలో ఈ సేవలు స్టార్ట్ అవ్వగా రీసెంట్ గా 9 సర్కిల్స్ లో సేవలను ప్రారంబించారు. మొదట ఈ 4జీ వోల్టే సేవల్ని ఎంచుకునేవారికి 30 జీబీ వరకు ఉచితంగా డేటా వస్తుంది. మూడు పద్ధతుల్లో ఈ డేటా లభిస్తుంది. మొదట 10 జీబీ ఫ్రీ డేటా ఇచ్చిన తరువాత మరో నాలుగు వారాల తరువాత అభిప్రాయాలూ చెబితే మరో 10 జీబీ డేటా వస్తుంది. ఇక చివరగా ఫీడ్ బ్యాక్ ఇస్తే అదనంగా మరో 10 జీబీ డేటా వస్తుందన్నమాట. మరి ఐడియా ప్రవేశపెట్టిన ఈ కొత్త ఐడియా ఇంకా ఏ స్థాయిలో వర్కౌట్ అవుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments