జనసేనానికి అరుదైన గౌరవం..బ్రిటన్ పార్లమెంట్ లో అవార్డు అందుకోనున్న పవన్ !

Monday, September 25th, 2017, 04:54:01 PM IST


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మరో అరుదైన గౌరవం లభించనుంది. అంతర్జాతీయ వేదికపై పవన్ కళ్యాణ్ అవార్డు ని అందుకోనున్నారు. ఈ మేరకు ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్(ఐ ఇ బి ఎఫ్) నుంచి పవన్ కళ్యాణ్ ఆహ్వానం అందుకున్నారు. బ్రిటన్ పార్లమెంట్ గా పిలిచే హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఐఇబి ఎఫ్ వారి కార్యక్రమం ప్రతిఏటా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖుల్ని ఆహ్వానించి అవార్డుని అందజేస్తారు. ఈ సారి పవన్ కళ్యాణ్ కు అవకాశం దక్కింది. ఐ ఇ బి ఎఫ్ ప్రతినిధులు నేడు పవన్ ని జనసేన పార్టీ కార్యాలయంలో కలుసుకున్నారు. తాము నిర్వహించే కార్యక్రమానికి వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా వారు పవన్ ని కోరారు.

నవంబర్ 17 న లండన్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఉద్దానం కిడ్నీ సమస్య, సామజిక సమస్యల పరష్కారం కోసం పవన్ చూపుతున్న చొరవవని ఐ ఇ బి ప్రతినిధులు ప్రశంసించారు. కార్యక్రమానికి తాను హాజరవుతానని పవన్ వారికీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇండో, యూరోపియన్ బడా పారిశ్రామిక వేత్తలు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ఫోటోల కోసం క్లిక్ చేయండి

  •  
  •  
  •  
  •  

Comments