మరో 20 ఏళ్ళైనా పోలవరం పూర్తి అవదు!

Monday, September 3rd, 2018, 05:32:11 PM IST

ఏపీ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి నేడు ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడ విచ్చేసారు. అక్కడ జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీకి జరిగిన అభివృద్ధి ప్రజలకు ఇంకా మర్చిపోలేదని, కాకపోతే రాష్ట్రాన్ని విడగొట్టాము అన్న భావనలో వున్న ప్రజలు తమకు గత ఎన్నికల సమయంలో ఆశించిన విధముగా ఓట్లువేయలేదని, అయినప్పటికీ అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో మంచి మెజారిటీ సాధించి తీరుతుందని అయనఆశాభావం వ్యక్తం చేసారు. టిడిపి అధికారాన్ని చేపట్టాక రాష్ట్రంలో ప్రజల సమస్యలు మరింతగా పెరిగాయని, బాబు తమ ఎమ్యెల్యేలు మరియు మంత్రులకు మాత్రమే మేలు చేసుకుంటూ,

ప్రజా సంక్షేమంన్ని పూర్తిగా గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. ఇక రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజక్టు పనులు కూడా టిడిపి జాప్యం చేస్తోందని, ప్రస్తుతం ఆ ప్రాజక్టు పనులు సాగె తీరు చూస్తుంటే, మరొక 20 ఏళ్ళకైనా పోలవరం పూర్తి అవుతుందా అనే అనుమానం అందరికి కలుగుతోందని అయన విమర్శించారు. ఇక పోలవరం ప్రాంత నిర్వాసితులకు ప్రభుత్వం భరోసా కల్పించి అన్ని సంక్షేమ పథకాలు వారికీ కూడా అందేలా చూడాలని అయన టిడిపి ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబు విదేశీ మరియు ఢిల్లీ పర్యటనల కోసం నాలుగేళ్లు గడిపారని, గత ఎన్నికల సమయంలో బీజేపీతో జతకట్టి రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ఇక్కడి ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని అన్నారు.

ఇటీవల కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో శ్రీ రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ చెప్పినట్లు, కేంద్రంలో రాబొయే ఎన్నికల్లో తాము అధికారాన్ని చేపడితే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చితీరుతామని, అదేవిధంగా విభజన సమయంలో చేసిన హామీలు కూడా నెరవేరుస్తామని అయన అన్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటినుండే అన్నివిధాలా ప్రజల్లోకి వెళ్తున్నామని, రెండు చోట్ల కూడా గతంకంటే పార్టీపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగిదని, అదే ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో తప్పక విజయం సాధించితీరగలమని అయన ధీమా వ్యక్తం చేశారు…..

  •  
  •  
  •  
  •  

Comments