చంద్రబాబుకు కోపమొస్తే మీరు భస్మమైపోతారు : మురళి మోహన్

Thursday, July 12th, 2018, 01:10:11 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి గత ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా విభజన హామీలు, మరియు ప్రత్యేక హోదా అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రస్తుతం ఏపీ రాష్ట్రానికి ఈ దుస్థితిని తీసుకువచ్చిందని రాజమండ్రి ఎంపీ మురళి మోహన్ నేడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధికి అప్పట్లో హామీ ఇచ్చిన మోడీ, మన ఆశలపై నీళ్లు చల్లి నిలువునా ముంచేశారని విమర్శించారు. ఆ నాడు తిరుపతి వెంకన్న సాక్షిగా, బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా, సింహాచలం అప్పన్న సాక్షిగా మన రాష్ట్రానికి చేస్తన్న సహాయలతాలూకు మాటలను మోడీ తప్పారని అన్నారు. అలానే మనకి అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరాన్ని కూడా ఏ ఇబ్బంది లేకుండా కడతామని అన్నారు, అది కూడా నెరవేర్చలేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన ఇచ్చిన అన్నిమాటలు వొట్టి బూటకమని తేలిపోయాయని అన్నారు. వాస్తవానికి అసలు మోడీ మన రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడానికి అసలు కారణం చంద్రబాబు గారే అని అన్నారు.

ఇప్పటికే ఏపీలో మంచి పేరున్న చంద్రబాబు, దేశ రాజకీయాల్లో కూడా కీలకంగా మారడంతో మన రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అవి చంద్రబాబు ఖాతాలోపడి ఆయనకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయని, తద్వారా ఆయన ప్రధాని కూడా అయ్యేఅవకాశం ఉండడంతో మోడీ ఇంత పెద్ద కుట్ర పన్నారని చెప్పుకొచ్చారు. రాజు తానా అంటే ఆయన క్రింద వారు తందానా అన్నట్లుగా ఇతర బీజేపీ నాయకులూ కూడా మన రాష్ట్రంపై విషం కక్కుతున్నారు అన్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడుగారు మన వాళ్ళు అని మంచికిపోయి చూస్తూ ఊరుకోవడడం వల్లనే వస్తోందని, ఒకవేళ ఆయనే కనుక కన్నెర్ర చేసి మీరు భస్మమైపోతారని, అయన మంచితనాన్ని తప్పుగా అర్ధం చేసుకోకండి అని తీవ్ర విమర్శలు చేశారు. మీ పాలనలో ఇప్పటికే దేశం చాలావరకు చిన్న భిన్నమైందని,దేశ ప్రజలు రానున్న ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా వున్నారని అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments