చంద్రబాబు రాకుంటే అరెస్ట్ చేస్తాం : నాందేడ్ ఎస్పీ కతార్

Friday, September 14th, 2018, 04:40:43 PM IST

బాబ్లీ ప్రాజెక్టు వివాదం తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం తరువాత హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆ కేసు విషయంలో నోటీసులు అందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెదాపా నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే ఎనిమిదేళ్ల నుంచి కేసు విషయంలో విచారణ జరపలేదని వస్తున్న కామెంట్స్ పై నాందేడ్ ఎస్పీ కతార్ స్పందించారు. ఐదేళ్ల క్రితమే చార్జిషీట్ దాఖలు చేసి ప్రతులను నిందితులుగా పేర్కొన్న వారికి పంపినట్లు వివరణ ఇచ్చారు.

ఇక అప్పుడు ప్రభుత్వ అధికారులతో దురుసుగా ప్రవర్తించిన అప్పటి నాయకులకు సంబందించిన అధరాలు సాక్ష్యాలుగా ప్రవేశపెట్టినట్లు కేసులో అభియోగాలు నమోదు చేశాక కోర్టు పరిధిలోనే విచారణ ఉంటుందని అన్నారు. ఇక వారిని ఎప్పుడు విచారించాలి అనేది కూడా కోర్టు నిర్ణయమని ఆదేశాలు వచ్చిన తరువాతే అరెస్ట్ ఉంటుందని చెప్పారు. చంద్రబాబుతో పాటు 16 మంది నిందితులను 21వ తేదీలోగా కోర్టులో హాజరుపర్చాలని ధర్మాబాద్ కోర్టు నుంచి ఆదేశాలు అందినట్లు వివరించారు. అయితే అంతలోగా నిందితులు వస్తారని తాము భావిస్తున్నట్లు ఎస్పీ కతార్ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments