నేనైతే శ్రీరెడ్డికి సభ్యత్వం ఇవ్వను : మురళి మోహన్

Friday, April 20th, 2018, 04:04:30 AM IST


ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న శ్రీరెడ్డిఅంశంపై పలువురు పలు విధాలుగా తమ అభిప్రయాన్ని వెలిబుచ్చుతున్నారు. తెలుగు సినీరంగంలో కాస్టింగ్‌ కౌచ్‌ ఉందటూ, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఉద్యమం ప్రారంభించిన శ్రీరెడ్డి వివాదం తరువాత రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు ఆమె చేసిన పోరాటం బాగుందని ఆమెకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ప్రస్తుతం ఆమె తన దాడిని జనసేన అధినేత పవన్ మీదకు మళ్లించడం, అంతే కాక ఆయన తల్లిని తప్పుపట్టేలా ఆమె చేసిన దూషణపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

ఐతే ఈ అంశంపై నేడు రాజమండ్రి ఎంపీ, సీనియర్‌ నటుడు మురళీమోహన్ స్పందించారు. ఒక భారతీయ మహిళ అయివుండి అర్థనగ్న ప్రదర్శన చేయటం తప్పు. క్రమశిక్షణతో లేనివారికి మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌లో సభ్యత్వం ఇవ్వరు. నేను మా అధ్యక్షునిగా ఉంటే శ్రీరెడ్డికి ఖచ్చితంగా సభ్యత్వం ఇవ్వను అన్నారు. అసలు ఆమె ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతోందని, అయినా అలా అర్ధనగ్న ప్రదర్శన చేస్తే సభ్యత్వం ఇచ్చేస్తారా అన్ని ఆయన ప్రశ్నించారు. మరోవైపు నటుడు శివ బాలాజీ పవన్‌ ను దూషించినందుకు శ్రీరెడ్డిపై రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు…..

  •  
  •  
  •  
  •  

Comments