జగన్ సై అంటే బాబుకు దబ్బిడి దిబ్బిడే…

Friday, May 4th, 2018, 12:00:51 PM IST

గత కొద్దికాలం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. బాబుపై ఆయన చేస్తున్న ఆరోపణలు.. విమర్శలు అంటా ఇంతా కాదు. ఇవన్నీ సింఫుల్ గా కొట్టిపారేసేలా లేకపోవటంతో అందరూ ఆయన చెప్తున్న మాటల్ని చాలా ఆసక్తిగా వింటున్న పరిస్థితి నెలకొన్నది.

ఇటువంటి పరిస్థితుల్లో .. తాజాగా చంద్రబాబు బాబు సైతం ఉలిక్కిపడే మాట ఒకటి చెప్పారు విజయసాయి. అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. నాలుగేళ్ల బాబు సర్కారు ఏమీ చేయలేదంటూ మండిపడిన విజయసాయి రానున్న ఎన్నికల్లో బాబుపై పోటీకి సిద్ధం కావటం ఆసక్తికరంగా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోచాలా చర్చనీయాంశంగా మారింది.

ఒకవేళ.. విజయసాయి మాటలకు బాబు కానీ ఓకే అంటే మాత్రం.. ఆంధ్ర రాష్ట్రంలో షాకింగ్ పరిణామాలు ఏర్పడటం ఖాయమని చెబుతున్నారు. సూటిపోటీ విమర్శలు చేసుకోవటం ఒక ఎత్తు అయితే . ఏకంగా ముఖాముఖిన ఎన్నికల చర్చల్లోకి ఇద్దరు ప్రముఖులు దిగటం మరో ఎత్తు. విజయసాయి కోరుకున్నట్లు బాబుపై పోటీకి జగన్ ఓకే అంటే మాత్రం.. 2019 ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించే పోటీగా వీరిద్దరి మధ్య పోటీ నిలుస్తుందని చెప్పక తప్పదు.