ఈ ప్లాన్లు వర్కౌట్ అయితే యడ్యూరప్పే సీఎం…

Saturday, May 19th, 2018, 12:02:55 PM IST

కర్ణాటక సీఎం పదవి భవిష్యత్తుకు ఈ రోజు ఫుల్ స్టాప్ పడనుందా, కామా పడనుందా అన్న విషయం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తేలనున్నది. భాజాపా బలనిరూపణ చేసుకోవడానికి కూడా అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 111. కానీ ఈ ఫిగర్ ను క్రాస్ కావాలంటే ప్రస్తుతం సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్పకు ఇంకా 7 మంది ఎమ్మెల్యేలు అవసరం. నిజానికి కర్ణాటక రాష్రంలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉండగా వాటిలో ఇంకా 2 సీట్లకు ఎన్నికలు జరపలేదు, అంటే ఇక్కడ మిగిలున్నవి 222 సీట్లు మాత్రమే అందులో మళ్ళీ జేడీఎస్ నేత కుమారా స్వామి 2 స్థానాలలో అనగా చెన్నాపట్నం, రామనగరం వద్ద విజయం సాధించగా ఇప్పుడు జరగబోయే విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు మాత్రమే వేసే హక్కు ఉంటుంది.

అంటే ఇప్పుడు ఆ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంక్య 221 అన్నట్టు. ఇప్పుడు ఏ పార్టీ ఎన్ని స్థానాలు సంపాదించుకుంది అని లేక్కేసుకోగా భాజాపా 104 స్థానాలు, కాంగ్రెస్ 78 స్థానాలు, జేడీఎస్ 38 స్థానాలు పొందగా మరో ముగ్గురు ఇండిపెండెంట్లుగా నిలిచారు. అయితే బలనిరూపనలో యడ్యూరప్ప గెలవాలి అంటే ఇప్పుడు భాజాపాకి ఇంకా 11 స్థానాలు కావాలి, దీనికి సంబంధించి ప్రస్తుతం యడ్యూరప్పకి మూడే దారులు ఉన్నట్టు పక్కాగా కనిపిస్తున్నాయి. మొదటిది కాంగ్రెస్, జేడీఎస్ అభ్యులు ఎవరైనా ఏడుగురు క్రాస్ ఓటింగ్ కి ఒప్పుకుని తలపడితే ఈ సారి భాజాపా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండవది బలనిరూపణకు ముందు ఇంచుమించు 14 మంది కొత్త అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా పదవీ ప్రమాణ స్వీకారం చేయకపోయినాకూడా భాజాపాకి ఆ రాష్ట్రంలో వారి ప్రభుత్వాన్ని నిలుపుకునే చాన్సు ఉంది. ఒకవేళ నిజంగానే అలా జరిగితే అప్పుడు శాసన సభలోని ఎమ్మెల్యేల సంఖ్యా 207కు చేరుతుంది. భాజాపాకు 104 ఉన్నందున ఇక్కడకూడా యడ్యూరప్ప ఒక్క నంబర్ తో ముందుండటం వల్ల సగం మార్క్ ను దాటుతాడు కాబట్టి చాకచక్యంగా హేలిచే అవకాశం ఉంది.

ఇప్పుడు కూడా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక ఇవన్నీ కాదు అంటే ఇంకో కొత్త రూటు కూడా ఉంది అదే మూడవది. కాంగ్రెస్. జేడీఎస్ లలో ఎవరైనా 14 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నవారు అసలు ఓటింగ్ కే పాల్గొనక పోవడం. ఎందుకుంటే భాజాపా సభలో తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు ఓటింగ్ కి రాకుండా పక్కన ఉంటే కచ్చితంగా భాజాపా పందెం నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలదు. ఎటు చూసినా ప్రస్తుత పరిస్థితుల్లో భాజాపా మాత్రం చాలా సేఫ్ జోన్ లో ఉన్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గానీ, జేడీఎస్ గానీ ఓటింగ్ ని ఉల్లంఘన చేసినా, ఓటింగ్ లో పాల్గొనకపోయినా ఇక ఆ ఎమ్మెల్యేల పై 6 సంవత్సరాల అనర్హత ప్రకటించబడుతుంది. అలా జరిగితే ఆ ఎమ్మెల్యేలు 6 సంవత్సరాల పాటు రాజకీయ జేవితానికి దూరం కావాల్సి వస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments