అది తింటే ఇక నరకానికేనట!

Tuesday, February 13th, 2018, 11:33:35 AM IST

ఆదివారం వచ్చిందంటే చాలు మనలో చాలా మందికి మాంసం లేనిదే ముద్ద దిగదు. మాంసాహారం వదిలి శాకాహారం వైపు రండి, మనకు మాంసం నుండి లభించే మాంసకృత్తులు, ప్రోటీన్ విటమిన్లు శాకాహారంలోనూ ఉన్నాయని శాఖాహారులు వాదన. మాంసం మానవజాతిని నాశనం చేస్తోంది, మాంసం తినడం పాపం అంటూ నినదిస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కండివాలి గ్రామంలో మీరట్ నగర పరంసంత్ బాబా జయగురుదేవ్ మహారాజ్, తన వంద మంది అనుచరులు లౌడ్ స్పీకర్లతో మాంసం తినడం సిగ్గుచేటు అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన జరిపి సంచలనం రేపారు.

మాంసం తినడం వల్ల మనిషిలో సున్నితత్వం నశించి క్రూరత్వం పెరిగిన మానవత్వాన్ని మరిచిపోయి ఎన్నో హింసలకు కారణభూతుడవుతున్నాడు అనేది వారి వాదన. అందువల్ల మాంసం మానండి, శాకాహారం తినండి అంటూ నినాదాలు చేశారు. నాన్ వెజ్ తింటే నరకానికి పోతారంటూ మాంసం వ్యతిరేక కమిటీ కార్యకర్తలు, శాకాహార ప్రచార ర్యాలీలకు శ్రీకారం చుట్టారు బాబా అనుచరులు. అయితే మాంసాహారం తినేవారు మారాలంటూ చేసిన ర్యాలీతో అక్కడ స్థానికంగా చేపలు, కోడిగుడ్లు, మాంసం విక్రయించేవారు కొంత ఆందోళన చెందారు. మాంసం తినేవారికి, మద్యం తాగేవారికి కౌన్సెలింగ్ చేస్తామని, శాఖాహారం వల్ల మనిషికి కలిగే లాభాలను ప్రతిఒక్కరికి వివరిస్తామని తద్వారా కనీసం కొందరీనైనా మార్చాలనేది తమ తలంపు అని శాకాహార ర్యాలీ నిర్వాహకుడు సుశీల్ సింగ్ చెప్పారు….