మీరు పట్టించుకోకపోతే తాజ్ మహల్ ను మూసేస్తాం : సుప్రీం కోర్ట్

Wednesday, July 11th, 2018, 08:53:16 PM IST


ఇప్పటికే తాజ్ మహల్ పరిరక్షణ బాధ్యతల విషయమై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు, నేడు దాని పరిరక్షణ బాధ్యతలపై రెండు ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక విషయంలోకి వెళితే, నేడు తాజ్ పై వేసిన పిటీషన్ ను విచారించిన జడ్జీల బెంచ్ తాజ్ రక్షణ మరియు భద్రత ఏర్పాట్ల విషయమై తీర్పు వెలువరిస్తూ, ఇప్పటికైనా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రం రెండూ కూడా తాజ్ బాగోగుల గురించి సరిగా పట్టించుకోవడం లేదని, పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పెడచెవిన పెడుతున్నాయని, ఇలాగే వారి తీరు కొనసాగితే త్వరలో తాజ్ ను మూసివేయకతప్పదని హెచ్చరించింది. ఇప్పటికైనా దాని నిర్వహణలోపాలు సరిదిద్దండి, ఎప్పటికపుడు వాటిని సవరించుకోండి,

లేకపోతే మేము దాన్ని కూల్చివేసే అవకాశం కూడా రావచ్చు అనేది ఆ తీర్పు మొత్తం సారాంశం. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్, పారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే కూడా ఎంతో గొప్పది మరియు సుందరమైనదని సుప్రీం వ్యాఖ్యానించింది. తాజ్ ను సక్రమంగా ఎటువంటి నిర్వహణ లోటు పాట్లు లేకుండా పర్యవేక్షించడం ద్వారా దేశంలో విదేశీ కరెన్సీ లోటును చాలావరకు భర్తీ చేయవచ్చని సుప్రీం వ్యాఖ్యానించింది. మరియు అంతే కాకుండా తాజ్ ట్రెపజియం జోన్ పరిధిలోని నిబంధనలను వ్యతిరేకిస్తూ, అక్కడ చేపట్టిన పారిశ్రామిక వాడల నిర్మాణంపై ఆ జోన్ చైర్మన్ ను కూడా ప్రశ్నించి, సరైన సమాధానం ఇవ్వవలసిందిగా ఆదేశించింది. ఇప్పటికైనా కేంద్రం కూడా ఈ విషయమై గట్టిగా చొరవ తీసుకుని తాజ్ ను మరింత భద్రంగా చూసుకోవాలనేది సుప్రీం కోర్ట్ వారి ఆవేదన…..

  •  
  •  
  •  
  •  

Comments