మీకు ఎస్బిఐలో ఎఫ్డి ఉందా…అయితే ఇది మీకు గుడ్ న్యూస్!

Monday, July 30th, 2018, 06:17:23 PM IST

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా తమ కస్టమర్లకు నేడు ఒక శుభవార్తను చెప్పింది. ఆర్బీఐ ద్వైపాక్షిక విధాన పరపతి సమీక్ష మరొక రెండు రోజుల్లో ప్రకటించనున్న సందర్భంగా ఎస్బిఐ తమ బ్యాంకు లో వున్న ఏఫ్ది (ఫిక్స్డ్ డిపాజిట్లు) పై ఇప్పటివరకు ఇస్తున్న వడ్డీరేట్లలో కొంత సడలింపు చేసింది. దీని ప్రకారం ఆ బ్యాంకు చేసిన ప్రకటన ఏంటంటే తమ బ్యాంకులో వున్న ఏఫ్డీలపై ఇప్పటివరకు వున్న వడ్డీ రేట్లపై 10 బేసిక్ పాయింట్లవరకు పెంచుతున్నట్లు ఆ బ్యాంకు ఇవాళ ఒక ప్రకటన విడుదల చేసింది. కోటి కంటే తక్కువ వున్న రిటైల్ డిపాజిట్లు అలానే ఏడాది నుండి పదేళ్లవరకు వ్యవధి వున్న డిపాజిట్లకు ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి. ఇవి నేడు అనగా జులై30 నుండి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ రేట్ లు సీనియర్ సిటిజన్లకు మరియు జనరల్ కేటగిరీ వారికీ వివిధ రకాల మొత్తాలను, ఆ డిపాజిట్ల కాలవ్యవధిని బట్టి రేట్లను నిర్ణయించినట్లు ఆ బ్యాంకు చెపుతోంది. అయితే సవరించిన కొత్త రేట్ విధానం ప్రకారం ఒక ఏడాది నుండి రెండేళ్ల వరకు వున్న డిపాజిట్లపై వడ్డీ రేట్ 6.65 శాతం నుండి 6.7 శాతానికి, అలానే ఇక సీనియర్ సిటిజన్లకు కొత్త రేట్ ప్రకారం 7.2 శాతం ఇవ్వడానికి నిర్ణయించారు. అమల్లోకి వచ్చిన ఈ రేట్లు, కొత్త మరియు రెన్యూవల్ చేసుకోబడిన అన్ని రకాల డిపాజిట్లకు వర్తించనున్నాయట. కాగా ఈ రేట్లను ద్రవ్యోల్భణ భయాలతోనే పెంచుతున్నట్లు ఆ బ్యాంకు అధికారులు కొందరు చెపుతున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments