మీరు విశ్వప్రయత్నాలు చేసినా గెలుపు మాదే… కేటీఆర్

Tuesday, November 6th, 2018, 05:22:42 PM IST

ఇప్పుడు జరిగే ఎన్నికలలో మేమె గెలిచి తీరుతామని, ప్రజల బలం మాకే ఉందని, దానికోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడా ఈసారి గెలిచేది తెరాస అని కేటీఆర్ గారు చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తెరాస 100సీట్లు గెలుపొందడం ఖాయమని, తగిన సమయం చూసి కెసిఆర్ గారు ప్రచారం చేస్తారని, కేటీఆర్ గారు అన్నారు. ఆయన మీడియా తో మాట్లాడుతూ ఇటీవల తన సహా మంత్రి హరీష్ రావు పైన మహా కూటమి నేతలు చేసినటువంటి వ్యాఖ్యలపై చాల ఘాటుగా స్పందించారు. ఎప్పటికి మహా కూటమి గెలవలేదని, అసలు అది ఇంకా పుంజుకోవడం లేదని, వారు ఇంకా సీట్ల కోసం అష్ట కస్టాలు పడుతున్నారని కేటీఆర్ ఎద్దేవ చేసారు.

తమ ప్రత్యర్ధులు ఇంకా ఎవరో తేలకపోవడం వల్లనే కెసిఆర్ గారు ఇంకా ప్రచారం ప్రారంభించలేదని, సరైన సమయం చూసి కెసిఆర్ ప్రచారానికి దిగుతారని చెప్పారు. తెరాస లో 99శాతం అసమ్మతి,అసంతృప్తి పోయిందని, ఈసారి కూడా తెరాస ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని తెలిపారు. టీడీపీ,కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జన సమితి కలిసి ఏర్పడిన మహాకుటమి ప్రజల్లో ఆదరణ సంపాదించలేకపోయిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పోటీ చేసేది కేవలం 3స్థానాల్లో అని, దానికి మేనిఫెస్టో ఎందుకని ఎద్దేవా చేసారు. తెలంగాణ లో అసలు ఈ కులపిచ్చి లేదని, చంద్రబాబు ఏపీ లో చేసే రాజకీయాలు ఇక్కడ చేస్తానంటే చెల్లవని కేటీఆర్ చెప్పారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గాన్ని కెసిఆర్ గారు చాల మార్చేశారని కేటీఆర్ చెప్పారు. తమ పార్టీ ముఖ్య నేత హరీష్ రావు పైన విపక్షాలు అనవసరంగా చేస్తున్న విమర్శలు దిక్కుమాలినవని మండిపడ్డారు. ఈ మధ్యన హరీష్ రావు పైన గజ్వేల్ కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి, టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం విదితమే.