ఆ దేశంలో సోషల్ మీడియా మాధ్యమాలు వాడితే పన్ను కట్టాలి!

Sunday, June 3rd, 2018, 06:27:20 PM IST

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగం అధికం అవడంతో దాదాపుగా ప్రతిఒక్కరు సోషల్ మీడియా సైట్స్ లోని తేలియాడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మనచుట్టూవున్నవారిని ఏమాత్రం పట్టించుకోకుండా వాటిలో తేలియాడేంతగా మునిగిపోతున్నారు. మరీ ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో అయితే ఈ వినియోగం మరింత ఎక్కువయినట్లు ఇటీవల జరిగిన కొన్ని సర్వేలు చెపుతున్నారు. వీటి వాడంకంతో మనకు నచ్చిన సమాచారాన్ని ఏ విధంగా అయినా లైక్ లు షేర్లు చేయవచ్చు, దానిపై ఎటువంటి అభ్యన్తరం ఉండదు. ఇక విషయంలోకి వెళితే, దాదాపుగా అన్ని దేశాల్లో వాట్స్అప్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాల వాడకం ఉచితమే. ఇది అందరికి తెలిసిన విషయం. అయితే ఒక దేశంలో మాత్రం ఇటువంటి సోషల్ మీడియా మాధ్యమాలు వాడితే అక్కడి ప్రజలు ప్రభుత్వాని పన్ను కట్టవలసి ఉంటుంది. అదే యుగాండా దేశం. వినటానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ, నమ్మక తప్పదు మరి.

అయితే వచ్చే నెల జులై 1 నుండి యుగాండాలో వాట్స్ అప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలు వాడినా ఇకపై అక్కడి గవర్నమెంట్ కు రోజుకు రూ.3.55 అంటే అక్కడి కరెన్సీ ప్రకారం 200 షిల్లింగ్స్ పన్నుగా చెల్లించవలసి ఉంటుంది. మనం చెప్పుకున్న వీటిల్లో ఏ ఒక్కటి వినియోగించిన, లేదా రెండు, మూడు మాధ్యమాలు వాడాలన్న మొత్తంగా మాత్రం తప్పక రోజుకు ఆ మొత్తాన్ని చెల్లించాలి. ఇప్పటివరకు ఏ దేశంలోనూ ఇటువంటి పన్ను విధానం అమల్లో లేకపోవడంతో ఈ వార్త విన్నవారు ఔరా అంటూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. అయితే విధానంపై కొంత వ్యతిరేకత వస్తున్నా, కొంతమంది ఈ విధానాన్ని సమర్థిస్తున్నారు. కాగా యుగాండాలో మొత్తం 20 లక్షలమంది వరకు ఫేస్ వినియోగదారులున్నట్లు ఆ దేశ నెట్ నిపుణులు చెపుతున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments