”జనసేన” పార్టీని వదిలితేనే మీకు లోన్ ఇస్తాం..అక్కడ టీడీపీ.!

Friday, November 2nd, 2018, 03:48:20 PM IST

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు మళ్ళీ తన ప్రజా పోరాట యాత్రను తిరిగి ప్రారంభించారు.అయితే ఈ సారి ఏ రాజకీయ నాయకుడు తీసుకొని విధంగా రైలు ప్రయాణం చేస్తూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ విజయవాడ నుంచి తునికి చేరుకోనున్నారు.అయితే ఇప్పటికే పవన్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా జనసేన కార్యకర్తలు తునిలో పవన్ యొక్క బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు వారి యొక్క గ్రామాల్లో ఏ సమస్యలు అయితే ప్రధానంగా ఉన్నాయో వాటి పట్ల తెలుగుదేశం నేతలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో,వారి యొక్క ఆవేదనను తెలుపుకున్నారు.

ఒకరు తన చిన్నప్పటి నుంచి వారి గ్రామంలో రోడ్లు యొక్క పరిస్థితి ఇప్పటికి దీన పరిస్థితిలోనే ఉందని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే వారి బతుకులు బాగవలేదని వాపోయారు,అంతే కాకుండా అక్కడ తుని దగ్గరలోనే ఉండే మరో వ్యక్తి తాను 2014లో పవన్ చెప్పడం వలన తమ వార్డులో ఉన్నటువంటి వారి అందరి ఓట్లు వేయించి అక్కడ తెలుగుదేశం కౌన్సిలర్ ని గెలిపిస్తే కనీసం అతను వారి యొక్క సమస్యలను కూడా పట్టించుకోవట్లేదని తీరా ఎవరైనా ఎదిరిస్తే వారికి ధృవీకరించిన లోన్లను సంతకాలు పెట్టకుండా ఆపేశారని,ఎందుకిలా చేశారు అని ప్రశ్నించగా మీరు జనసేన పార్టీని వదిలితేనే మీకు లోన్లు జారీ చేస్తామని అక్కడి టీడీపీ నేతలు తెలుపుతున్నారని మండిపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments