షాక్‌ : మ‌హేష్ ఫ్యాన్, ఐఐటీ విద్యార్థి సూసైడ్‌

Friday, April 27th, 2018, 10:20:20 PM IST


సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఓవైపు `భ‌ర‌త్ అనే నేను` స‌క్సెస్ యాత్ర‌లో బిజీబిజీగా ఉన్నారు. నేడు విజ‌య‌వాడ‌, అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. తిరుమ‌లేశుని ద‌ర్శ‌నం అనంత‌రం నేరుగా విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. మ‌హేష్ ఈ హ‌డావుడిలో ఉండ‌గానే అత‌డి వీరాభిమాని కం స్టూడెంట్‌ ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌లక‌లం రేపింది. స‌ద‌రు విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకుంటూ త‌ల్లిదండ్రుల‌కు ఓ సూసైడ్ లెట‌ర్‌, మ‌హేష్‌కి వేరొక లెట‌ర్ రాయ‌డం సంచ‌ల‌న‌మైంది.

వివ‌రాలు ప‌రిశీలిస్తే… గుంటూరు జిల్లాకు చెందిన పులి సునంద్ కుమార్ రెడ్డి ఐఐఐటి -హైద‌రాబాద్ క్యాంప‌స్‌లో నాలుగో ఏడాది సీఎస్‌డీ విద్య‌న‌భ్య‌సిస్తున్నాడు. కాలేజ్ హాస్టల్లోనే ఉంటూ చ‌దువు కొన‌సాగిస్తున్నాడు. అయితే అత‌డిపై చ‌దువుల ఒత్తిడి భార‌మ‌వ్వ‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. మ‌హేష్‌కి అత‌డు రాసిన లేఖ ప‌రిశీలిస్తే.. అత‌డిపై ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. సునంద్ రెడ్డి ఉంటున్న హాస్ట‌ల్ గ‌ది అంతా మ‌హేష్ పోస్ట‌ర్ల‌తో నిండి ఉంది. అలానే నోట్‌లోనూ మ‌హేష్ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని, అత‌డు న‌టించిన సినిమాల‌న్నీ చూసేశాన‌ని రాసుకున్నాడు. ప్ర‌స్తుతానికి అత‌డి ఆత్మ‌హ‌త్య ఓ మిస్ట‌రీ అని స్నేహితులు చెబుతున్నారు. అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకునేంత‌, డిప్రెష‌న్‌కి లోన‌య్యేంత పిరికివాడు కాడ‌ని అంతా చెబుతున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తును సాగిస్తున్నారు. ఈ ఆక‌స్మిక వార్త మ‌హేష్‌కి పెద్ద షాకింగ్ అనే చెప్పాలి.

  •  
  •  
  •  
  •  

Comments