నా కళ్ళ ముందు కనిపిస్తే మా నాన్నని అయినా చంపేస్తా.. అమృత!

Sunday, September 16th, 2018, 01:14:09 PM IST

కులం అనేది కేవలం తాను చేసే వృత్తికి మాత్రమే నిదర్శనం అని మానవుడు మర్చిపోయి,కులం అనే ఊబిలో ఇరుక్కుపోయాడు.ఉండటానికి 20వ శతాబ్దంలో ఉన్నా ఆలోచనా పరంగా ఇంకా వెనుకబాటు లోనే ఉండిపోయి మానవత్వం మరిచి సాటి మనుషుల ప్రాణాలు తీస్తున్నాడు.తమ కన్నా తక్కువ కులం వాడు తన కూతురుని పెళ్లి చేసుకున్నాడనే నెపంతో పక్కా పథకం ప్రకారం తన తల్లి తన భార్య కళ్లెదుటే అతి దారుణంగా,కిరాతకంగా అమృత యొక్క తండ్రి మారుతిరావు శిరచ్చేదనం చేసిన సంగతి తెలిసినదే దీనితో ప్రణయ్ యొక్క కుటుంబీకులు,అతని భార్య అమృత శోక సముద్రంలో మునిగిపోయారు.తన తండ్రి కావాలనే ప్రణయ్ మీద ఎప్పటి నుంచో తీవ్రమైన వ్యతిరేఖత,కక్ష్య పెంచుకున్నాడు అని అందుకే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు అని అమృత తెలిపింది.

తన భర్త తనని చాలా బాగా చూసుకునేవాడు అని వారికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు ఇలా సైకోలా తన తండ్రి చేసాడు తెలిపింది. ఈ చర్యకు పాల్పడ్డ ప్రతి ఒక్కరు దోషులే అని దీనిలో ఆమె బాబాయ్, మరియు కాంగ్రెస్ నేత ఎండి కరీం హస్తం కూడా ఉంది అని వాపోయింది. ప్రతి ఒక్కరికి కఠిన శిక్షలు అమలు చెయ్యాలని తెలిపింది,ఇందులో భాగంగా అమృత తండ్రికి తాను చేసిన తప్పులో మచ్చుక అయినా సరే పశ్చాత్తాపం వెల్లడించడం లేదు అని ఇది అంతా తన కూతురు బాగుండాలనే చేశాను అని ఏ మాత్రం బాధ లేకుండా తెలుపుతున్నారు, ఒకవేళ భవిష్యత్తులో అమృత యొక్క తండ్రి తన దగ్గరకి వచ్చి క్షమాపణ కోరినా సరే తాను క్షమించను అని మళ్ళీ తన ముందు తన తండ్రి కనిపిస్తే నిస్సందేహంగా చంపేస్తాను అని అమృత తెలిపింది..

  •  
  •  
  •  
  •  

Comments