నేనేం మీ కాంగ్రెస్ పప్పుని కాదు : కేటీఆర్-ఉత్తమ్ మాటల యుద్ధం.

Saturday, September 8th, 2018, 01:16:30 PM IST

తెలంగాణా లోని రాజకీయం వేడెక్కుతున్న నేపధ్యం లో ఒకరి మీద ఒకరి మాటల దాడి తీవ్ర రూపం దాలుస్తుంది. ఇటీవలే ట్విట్టర్ వేదికగా టీపీసీసీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు తెలంగాణా ఐటీ మినిస్టర్ కేటీఆర్ వారి మాటల అస్త్రాలను ఒకరి మీద ఒకరు మాటల తూటాలు సంధించుకుంటున్నారు. మొన్న ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ కేటీఆర్ అమెరికాలో ఉండేటప్పుడు అంట్లు తోముకునేవాడు అని తండ్రి యొక్క పలుకుబడితో దొడ్డి దారిన ఇక్కడికి వచ్చి మంత్రి అయ్యాడని పేర్కొన్నారు.

దీనికి ప్రతి స్పందనగా కేటీఆర్ కూడా ధీటుగా సమాధానము ఇచ్చారు. అమెరికాలో ఉండేటప్పుడు నేను అంట్లు తోముకున్నా అని మీరు అంటున్నారు, దానికి నేనేం సిగ్గు పడటం లేదు అక్కడ ఉండే ప్రతి భారాతీయుడు వారి ఇంట్లో అలా చేసుకుంటారు. నేను కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇంట్లో ఉంటున్నందుకు నేను గర్వ పడుతున్నాను. రాహుల్ గాంధీని ఉద్దేశించి అంతే కానీ నేను మీ పప్పులా కాదు అని ప్రజలను మోసం చేసి దోచుకున్న డబ్బుతో ఉన్న కారును తగలబెట్టుకున్న మీలా అస్సలు కాదు అని తనదైన శైలి లో సమాధానం ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments