ఆంధ్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు..!

Tuesday, November 6th, 2018, 05:26:39 PM IST

ఈ రోజు సీఎం క్నాద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ అయిన విషయం తెలిసిందే, రాష్ట్రం ఎన్నికల హడావుడి మొదలవనున్న సందర్భంలో జరిగిన క్యాబినెట్ భేటీ కావటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఈ భేటీలో ఏపీ క్యాబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది, ఆ నిర్ణయాల వివరాలు ఇలా ఉన్నాయి.

– కేంద్రం నెరవేర్చని హామీల రాష్ట్రమే అమలు చేయాలని నిర్ణయం.
– రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం.
– నెల రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన.
– ప్రైవేట్ సంస్థలతో కలిసి ప్రభుత్వ జాయింట్ వెంచర్ గా ఏర్పాటు దిశగా ప్రయత్నాలు.
– పీపీపీ మోడల్ లో వైజాగ్ మెట్రో ఏర్పాటు చేయాలనీ నిర్ణయం.
– రూ. 800 కోట్లతో 42కిలోమీటర్ల మేర వైజాగ్ మెట్రో.
– అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు.
– గ్రామీణ ప్రాంతాల్లో 152 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ప్రపంచంలోనే పీపీపీ మోడల్ లో నిర్మాణం అవుతున్న రెండో అతి పెద్ద మెట్రో గా వైజాగ్ మెట్రో పేరుగాంచనుంది. ఇప్పటికే రూ. 4200 కోట్ల ఋణం ఇచ్చేందుకు కొరియన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. గాజువాక – కొమ్మద్ది -30 కిలోమీటర్లు, గురుద్వారా – ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ 25కిలోమీటర్లు, – తాటిచెట్ల పాలెం- వాల్తేరు మధ్య 6.5 కిలోమీటర్ల మేర వైజాగ్ మెట్రో ఉండబోతుంది. వీటితో పాటుగా రాయపట్నం పోర్టు ఏర్పాటు పైన క్యాబినెట్ చర్చింది.