పాకిస్తాన్ రహస్యాలను భారత్ కు చెప్పానా? : మాజీ క్రికెటర్

Wednesday, January 10th, 2018, 01:38:31 PM IST

ఈ మధ్య కాలంలో పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అక్కడి మీడియాలో చర్చనీయాంశం అవుతున్నారు. పాకిస్తాన్ లో ప్రతిపక్ష తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ అధినేత గా కొనసాగుతోన్న ఇమ్రాన్‌ ఖాన్‌ మూడవ పెళ్లి చేసుకోబోతున్నారని అనేక కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇమ్రాన్ ఖాన్ అసహనం వ్యక్తం చేశాడు. నేను ఏమైనా తప్పు చేశానా ? లేక పాకిస్తాన్ రహస్యాలను భారత్ కు చెప్పనా అని అక్కడి మీడియాపై ఫైర్ అయ్యారు. అంతే కాకుండా పెళ్లి చేసుకోవడం చేసుకోక పోవడం నా వ్యక్తిగత విషయమని చెబుతూ..నేను ఎదో జాతీయ సంపద దోచుకున్నట్లు ప్రచారం చేస్తున్నారని. మూడో పెళ్లి అంత పెద్ద నేరమా అని ప్రశ్నించారు. అయితే ఈ వ్యవహారం గురించి ఆలోచిస్తుంటే.. తనపై కావాలనే అధికార పక్షం కుట్రలు పన్నుతోందని ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments