పాకిస్తాన్ ప్రధాని నేనే!

Monday, July 30th, 2018, 05:41:15 PM IST

పాకిస్తాన్ రాజకీయాల వైపు ప్రస్తుతం ప్రపంచమంతా చూస్తోంది. నాటకీయ పరిణామాలను తలపిస్తున్న అక్కడి పాలిటిక్స్ లో అధికారాన్ని సొంతం చేసుకునే నాయకుడు ఎవరని అంతా చర్చించుకుంటున్నారు. ఇకపోతే పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అవుతాడని అక్కడి మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నెల 25న పాకిస్తాన్ లో జరిగిన జాతీయ ఎన్నికల్లో ఇమ్రాన్ పిటిఐ పార్టీ 116 స్థానాలలో గెలుచుకుంది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎన్నికల్లో గెలిచినా 172 మంది సభ్యుల మద్దతు ఉండాలి. 137 మంది పార్లమెంట్ కు ఎన్నికవ్వాలి. జీడీఏ, ఎంక్యూఎం-పీ, అవామీ ముస్లిం లీగ్ పార్టీలు ఇప్పటికే ఇమ్రాన్ కు తమ మద్దతు ప్రకటించగా సంఖ్యా బలం 122కు చేరింది. ఇక మరికొన్ని చిన్న తరహా పార్టీలను అలాగే స్వతంత్ర అభ్యర్థుల మద్దతును కూడగట్టుకుంటున్న ఇమ్రాన్ వచ్చే నెల 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా పేర్కొన్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments