గెలుపంటే తెలంగాణదే : మమతా బెనర్జీ

Wednesday, March 28th, 2018, 02:53:04 AM IST

2019 ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో దేశంలో నూటికి నూరుపాళ్ళు ప్రాంతీయ పార్టీలదే హవా అని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. ఇవాళ మమతా బెనర్జీ ఢిల్లీలో పలు పార్టీల నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ..తమిళనాడులో డీఎంకే, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందని చెప్పారు. బీజేపీని ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలని సూచించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని కోరారు. ప్రాంతీయ పార్టీల కూటమిలో ఎన్డీఏలోని పార్టీలు కూడా చేరుతాయని మమతాబెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు.