ఏపిలో దోపిడీ మొదలైంది…!

Wednesday, March 4th, 2015, 03:31:22 PM IST


ఆంధ్రప్రదేశ్ లో దోపిడీ రాజ్యం మొదలైందని… అందుకు పట్టిసీమ ప్రాజెక్టే నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ మాజీ పీసిసి అధ్యక్షుడు బొత్సా సత్యన్నారాయణ అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఇంతవరకు సరియైన నిధులను సమకూర్చడంలో ప్రభుత్వం విఫలం అయిందని, పోలవరాన్ని కావాలనే జాప్యం చేస్తున్నారని బొత్సా విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి ఇప్పుడు హడావుడిగా పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని తెరపైకీ తీసుకురావడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పట్టిసీమ వలన రైతులకు మేలు జరగదని… కేవలం పట్టిసీమ పేరుతో 2వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయబోతున్నారని బొత్సా అన్నారు. మొన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుంటే.. బీజేపి, తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎంపీలు ఏమీ పట్టించుకోవడంలేదని బొత్సా ఆవేదనను వ్యక్తం చేశారు.