నాలుగు గాడిదలు ఉంటె లక్షాధికారి మిరే!

Tuesday, January 2nd, 2018, 11:06:13 AM IST

అత్యధిక జనాభా కలిగిన చైనా టాప్ లో ఉందన్న విషయం అందరికి తెలిసిందే. అయితే చైనాలో ఏ తరహా ఘటన జరిగినా ప్రపంచమంతా షాక్ అవుతుంది. ఆర్థిక ఇబ్బందుల విషయంలో చైనా చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంతే కాకుండా వన సంపద జంతు సంరక్షణ లాంటి విషయంలో కూడా చైనా ఆలోచన చాలా డిఫెరెంట్ అని చెప్పాలి. కానీ ఎంత జాగ్రత్త పడినా అక్కడ జన సాంద్రత ప్రతి నిమిషం పెరుగుతూనే ఉంది. అయితే ఇటీవల ఆ దేశంలో ఒక ఊహించని కొరత ఏర్పడింది.

చైనాలో ప్రస్తుతం గాడిదల సంఖ్య చాలా తక్కువైంది. అక్కడ గాడిదల వ్యాపారం ఓ రేంజ్ లో జరుగుతుంటుంది. వాటి తోలు నుంచి ఒక రసాయనాన్ని తీసి చర్మ సౌందర్య ఔషధాల్లో వాడతారు. అంతే కాకుండా కొన్ని ప్రాంతాల్లో గాడిత మాంసాన్ని వారు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే గత కొంత కాలంగా గాడిదల సంఖ్య తగ్గడంతో ఆ దేశం ఇతర దేశాల నుంచి గాడిత తోలు విక్రయదారులు ఆకర్షిస్తోంది. ప్రస్తుతం చైనా భారీ ధరకు గాడిదల తోలును కొనుక్కుంటోంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక్కో గాడిద తోలు విలువ రూ.30 వేలకు పైనే ఉంటుందని తెలుస్తోంది.